AP Government: గోదావరి వరదలతో నష్టపోయిన బాధితులకు పరిహారం విడుదల చేసేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గోదావరి వరదల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12.85 కోట్ల నిధులు విడుదల చేసింది.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గోదావరి నదిలో ఏర్పడిన వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో భారీ నష్టాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు పరిహారం అందించే దిశగా తక్షణ చర్యలు చేపట్టింది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని బాధితులకు సహాయం చేయడానికి రూ.12.85 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: 2026 MG Hector టీజర్ విడుదల.. స్పెక్స్, ఫీచర్లు, అంచనా ధరలు ఇవే..!
ఈ నిధులను వరదల వల్ల పునరావాస కేంద్రాలు, సహాయక కేంద్రాల్లో ఉన్న బాధితుల నిత్యావసరాల కోసం.. నష్టపోయిన ఇళ్ల కోసం నేరుగా నిధులు పంపిణీ.. నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా బాధితుల ఖాతాల్లోకి పంపించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా వరద బాధితుల జీవితాలను సత్వర రీహాబిలిటేషన్ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ఈ ప్రణాళికను పర్యవేక్షిస్తూ, తదుపరి నెలల్లో కూడా అవసరమైతే అదనపు సహాయం అందించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..