Gangamma Temple EO Arrested: శ్రీ సత్యసాయి జిల్లాలోని గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం వ్యవహారం సంచలనంగా మారింది.. సీసీ కెమెరాలో గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.. కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ గుడిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆలయ ఈవో మురళీకృష్ణ చేసిన దొంగతనం బట్టబయలు అయ్యింది.. తాజాగా బయటపడిన సీసీ కెమెరా దృశ్యాల్లో, ఈవో మురళీకృష్ణ తన భార్యతో కలిసి కార్యాలయంలోకి చేరినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లోపలికి వెళ్లిన తరువాత, తన సతీమణికి ఆలయ దర్శనం చేయించుకురమ్మని అసిస్టెంట్‌ను బయటకు పంపాడు. ఇదే సమయంలో కార్యాలయం బీరువాలో ఉన్న వెండి నగలు, విలువైన చీరలు, కొంత బంగారాన్ని టేబుల్‌పై పెట్టి మూటలు కట్టడం వీడియోల్లో రికార్డు అయ్యింది..
Read Also: Palash Muchhal-Smriti Mandhana: మంధాన మధుర జ్ఞాపకాన్ని చెరిపేసిన పలాష్ ముచ్చల్!
ముందే పథకం ప్రకారం సిద్ధం చేసుకున్న ఆటో డ్రైవర్‌ను కార్యాలయంలోకి పిలిపించి, కట్టిన మూటలను ఆటోలో పెట్టించడంతో మొత్తం ఘటన పూర్తయింది. ఈ సంఘటన మొత్తాన్ని సీసీ కెమెరాలు స్పష్టంగా రికార్డ్ చేశాయి.. ఈ విషయమంతా తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఈవో మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేకుండా ఆలయ ఆభరణాలు తరలించినందుకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అయితే, 6.23 లక్షల రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. 6 కేజీల వెండి, 2 గ్రాముల బంగారం, 15 చీరలు పోలీసులు సీజ్ చేశారు.. ఈ ఘటనతో ఆలయ పరిపాలన విధానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు, స్థానికులు ఆలయ భద్రతా చర్యలపై పునర్విమర్శ అవసరమని డిమాండ్ చేస్తున్నారు.