ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు.. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారింది.. బ్యాక్‌టు బ్యాక్ మీటింగ్‌లు, వరుసగా మౌ సంతకాలతో రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో చర్చలు జరిపారు. రెండో రోజు మొత్తం రూ.1,11,395 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఊతం కానుంది. ఈ పెట్టుబడులతో కొత్త సంస్థలు.. భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి.. అయితే, పెట్టుబడుల సంఖ్య మరింత పెరగనుంది..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలు.. ప్రాజెక్టులు, ఉద్యోగాలు పరిశీలిస్తే..
* గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్
రూ. 150 కోట్లు పెట్టుబడి
40 ఎకరాలు భూమి అవసరం
రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో డెయిరీ యూనిట్ విస్తరణ
300 ప్రత్యక్ష ఉద్యోగాలు
* ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ఫుడ్ & అగ్రికల్చర్‌కు అత్యాధునిక R&D సెంటర్
అరుదైన చక్కెరల తయారీకి గ్రీన్‌ఫీల్డ్ యూనిట్
మొత్తం పెట్టుబడి రూ.2,000 కోట్లు
దశ 1 – రూ.500 కోట్లు
దశ 2 – రూ.1,500 కోట్లు
100 ఎకరాల భూమి
800+ ఉద్యోగాలు
అదనంగా సుస్థిర వ్యవసాయానికి రూ.200 కోట్ల ప్రాజెక్ట్
* KJS ఇండియా
ఫుడ్ & బేవరేజెస్ తయారీ యూనిట్-2 విస్తరణ
రూ. 650 కోట్లు
44 ఎకరాలు
1,551 ఉద్యోగాలు
నెస్లే, యూనిలీవర్ వంటి గ్లోబల్ బ్రాండ్లకు కాంట్రాక్ట్ తయారీ
* ఓల్డ్‌టైమ్ కాఫీ అండ్ లిమిటెడ్ బేవరేజెస్
ఎగుమతి-ఆధారిత ప్రీమియం ఫ్రీజ్-డ్రైడ్ కాఫీ ప్లాంట్
రూ. 1,100 కోట్లు
15 ఎకరాలు
1,000 ఉద్యోగాలు
* రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL)
పానీయాలు, స్నాక్స్, మిఠాయిలు, FMCG ఉత్పత్తుల తయారీ ప్లాంట్
రూ. 1,500 కోట్లు
100 ఎకరాలు
1,000 ఉద్యోగాలు
* కేన్స్ టెక్నాలజీ ఇండియా
ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ విస్తరణ
పెట్టుబడి: రూ.1,000 కోట్లు
* JCK ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్
డేటా సెంటర్ & మౌలిక సదుపాయాలు
పెట్టుబడి రూ.9,000 కోట్లు
2,000 ఉద్యోగాలు
* RCT ఎర్నర్జీ ఇండియా
మూడు దశల్లో రూ.2,500 కోట్లు పెట్టుబడి
1,600+ ఉద్యోగాలు
* Aqylon Nexus Ltd
క్లిన్ ఎనర్జీ ఆధారిత 50MW డేటా సెంటర్
Telangana Net Zero Data Center Hub లక్ష్యం
AI ఆధారిత IoT సొల్యూషన్లు కూడా
* AGP గ్రూప్
125 ఎకరాల్లో 1GW హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్
BESS స్టోరేజ్ యూనిట్
మొత్తం పెట్టుబడి: రూ.6,750 కోట్లు
* InfraKey DC Parks
1GW స్కేలబుల్ డేటా పార్క్
150 ఎకరాలు
మొత్తం పెట్టుబడి రూ.70,000 కోట్లు
ఫ్యూచర్-రెడీ కూలింగ్ ఇన్‌ఫ్రా
* పరిధి గ్రూప్
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) + AI హైపర్‌స్కేల్ డేటా సెంటర్
తొలి దశలోనే 3,000 ఉద్యోగాలు
8–10 ఎకరాల్లో 50MW డేటా సెంటర్
* హెటెరో గ్రూప్
భారీ ఫార్మా ఫార్ములేషన్ యూనిట్
పెట్టుబడి: రూ.1,800 కోట్లు
భూమి: 100 ఎకరాలు
9,000+ ఉద్యోగాలు
* భారత్ బయోటెక్
స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ CRDMO సౌకర్యం
పెట్టుబడి రూ.1,000 కోట్లు
200+ ఉద్యోగాలు
* అరబిందో ఫార్మా
కాంప్లెక్స్ జెనరిక్స్, బయోసిమిలర్స్, బయోలాజిక్స్ విస్తరణ
పెట్టుబడి రూ.2,000 కోట్లు
3,000 ఉద్యోగాలు
* గ్రాన్యూల్స్ ఇండియా
ఆంకాలజీ CDMO & పెప్టైడ్ మాన్యుఫ్యాక్చరింగ్
పెట్టుబడి రూ.1,200 కోట్లు
100 ఎకరాలు
2,500–3,000 ఉద్యోగాలు
* జివా & లిమిటెడ్
భారీ వ్యాక్సిన్ & R&D యూనిట్లు
పెట్టుబడి: రూ.3,500 కోట్లు (మొత్తం 4,000 కోట్లు)
150 ఎకరాలు
3,000 ఉద్యోగాలు
మొత్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు పరిశ్రమల విభాగానికే కాదు, పౌరులకు, ఉద్యోగార్ధులకు కూడా ఆశాకిరణాన్ని చూపింది. డేటా సెంటర్ల నుంచి ఫార్మా వరకు, అగ్రిటెక్ నుంచి FMCG వరకు… తెలంగాణలో పెట్టుబడుల విస్తరణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి భారీ బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు..