రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఇవాళ వైసీపీ ఆద్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45కి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. మొత్తం 15 అంశాలు ఎజెండాగా ఈ రోజు కేబినెట్ భేటీ జరగనుంది..
అమెరికాలో తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు.. పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి సొంత గన్‌మ్యాన్ బుల్లెట్ యూరియా రూపంలో గట్టిగానే దిగిందట. గన్‌మ్యాన్ నాగు నాయక్ యూరియా లోడ్‌ను పక్కాదారి పట్టించిన వ్యవహారం... తిరిగి తిరిగి ఎమ్మెల్యేకు మెడకు చుట్టుకున్నట్టు తెలుస్తోంది. అది ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారడంతో...బీఎల్ఆర్ మీద అధికార పార్టీ కీలక నేతలు బాగా సీరియస్ అయినట్టు సమాచారం. ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసి.... తన ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే బత్తుల ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారట. చిన్న నిర్లక్ష్యానికి.. ఆయన భారీ మూల్యమే చెల్లించుకొవాల్సి వస్తోందని…
Off The Record: అనర్హత పిటిషన్స్ విచారణలో భాగంగా… ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. వాళ్ళ నుంచి రిప్లయ్స్ కూడా వచ్చాయి. ఆ సమాధానాల ఆధారంగా… వాళ్ళ మీద వేటేయాలని ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఆ నోటీసులకు సమాధానంగా… ప్రతిపక్షం తరపున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద, చింత ప్రభాకర్ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి రిప్లై ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన […]
Off The Record: 2029 అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇప్పటి నుంచే గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారా అంటే…అవును, వాతావరణం అలాగే కనిపిస్తోందన్నది పరిశీలకుల సమాధానం. తన విషయంలో పార్టీ పెద్దల ఆలోచన ఎలాఉందో… చూచాయగా తెలుసుకున్న అవినాష్….అందుకు భిన్నంగా ఇప్పట్నుంచే పావులు కదిపి అప్పటికి లైన్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారట. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అవినాష్. ఆ తర్వాత […]