Tirumala Parakamani Case: పరకామణి చోరీ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Parakamani Case: సంచలనం సృష్టించిన తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు మరోసారి హైకోర్టు దృష్టిని ఆకర్షించింది. ఈ కేసులో జరిగిన వివాదాస్పద పరిణామాలు, ముఖ్యంగా లోక్ అదాలత్ వద్ద జరిగిన రాజీ ఒప్పందం చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో సీఐడీ అదనపు నివేదికను కోర్టుకు సమర్పించింది.
Read Also: IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ వద్ద జరిగిన రాజీ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పష్టత కోసం సీఐడీ నూతనంగా ఒక అదనపు నివేదికను హైకోర్టుకు అందజేసింది. ఈ నివేదికలో రాజీ ప్రక్రియపై మరిన్ని వివరాలు, సంబంధిత పత్రాలు ఉన్నట్లు సమాచారం. అయితే, సీఐడీ సమర్పించిన అదనపు నివేదికకు మరో రెండు సెట్స్ సిద్ధం చేసి, వాటిని సీల్డ్ కవర్లలో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వద్ద జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ నడుస్తున్నందున వివరాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది.
Read Also: IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తుతం ఈ కేసులో జరిగిన లోక్ అదాలత్ అవార్డ్ చట్టబద్ధతను పరిశీలిస్తోంది. కోర్టు రిజిస్ట్రీకి స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తూ.. “సీఐడీ సమర్పించిన అన్ని నివేదికలను ధర్మాసనం ముందు ఉంచాలి” అని ఆదేశించింది. ఈ నివేదికల ఆధారంగా రాజీ ఒప్పందం చట్టపరంగా నిలబడుతుందా లేదా అన్న దానిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. అయితే,సీఐడీ సమర్పించిన తాజా నివేదికను పూర్తిగా పరిశీలించి, తదుపరి ఉత్తర్వులపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. తదుపరి విచారణలో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. తిరుమల పరకామణి చోరీ వివాదంలో లోక్ అదాలత్ ఒప్పందం నిజంగా చట్టబద్ధమా? అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో వెలువడనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?