CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ సీఎస్ సాయిప్రసాద్ హాజరయ్యారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు మొత్తం 5,28,217 గ్రీవెన్స్‌లు అందగా, వాటిలో 4,55,189 గ్రీవెన్స్‌లను పరిష్కరించినట్లు అధికారులు నివేదించారు. ప్రస్తుతం 73,000 గ్రీవెన్స్‌లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పాలనా సంస్కరణల్లో భాగంగా ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూటేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో 2024 జూన్ నుంచి 22-A జాబితా నుంచి తొలగించాలంటూ 6,846 దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం, వెబ్ ల్యాండ్ 2.0లో డేటా నమోదు పూర్తయిందని అధికారులు వెల్లడించారు. రీసర్వేలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా భూ రికార్డుల అప్‌గ్రెడేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా 2.77 కోట్ల కుల ధ్రువీకరణ పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేసినట్టు వివరించారు.
Read Also: Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు
ఇక, స్టాంప్ & రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 10,169 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ విధానం కోసం చర్యలు వేగవంతం చేశారు. ఇక త్వరలో జరగబోయే రిజిస్ట్రేషన్ కార్యక్రమాల ద్వారా 15,570 రిజిస్ట్రేషన్లతో రూ. 250 కోట్ల ఆదాయం వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేశారు. సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులు చర్యలపై పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.