Venkatesh-Trivikram : ‘ఆదర్శ కుటుంబం’.. ఫ్యామిలీ డ్రామా అనుకుంటే పొరపాటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం : హౌస్ నెం. 47’ (AK 47) ప్రస్తుతం సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. టైటిల్ చూస్తే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తున్నా, లోపల మాత్రం త్రివిక్రమ్ గట్టి ప్లానే వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కథ గురించి వినిపిస్తున్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..
Also Read : Chiranjeevi NTR National Award: మెగాస్టార్‌కు ఎన్టీఆర్ అవార్డు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్!
Also Read
ఫస్ట్ హాఫ్ అంతా ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాల్లాగా వెంకీ మార్క్ కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుందట. కానీ, ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఒక ఊహించని ట్విస్ట్ సినిమాను ఒక్కసారిగా సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్తుందని సమాచారం. టైటిల్ కింద ఉన్న ‘AK 47’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే సెకండ్ హాఫ్‌లో సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. ఎలా..? అంటే.. సినిమా సెకండ్ హాఫ్ త్రివిక్రమ్ క్లాసిక్ హిట్ ‘అతడు’లోని మలుపులను గుర్తుకు తెస్తుందని టాక్. ‘గుంటూరు కారం’ సమయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా, ఈసారి ‘అల వైకుంఠపురములో’ తరహా ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు క్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను త్రివిక్రమ్ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారట. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్ ఫేమ్) సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో, వేసవి (Summer 2026) నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టి, అక్టోబర్ 2న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!