అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు పి, రవితేజ మన్యం సంయుక్తంగా దీన్ని నిర్మించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న విడుదల కావాల్సిన ఈ సినిమా ఓ వారం ఆలస్యంగా జూలై 1న రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… నటుడు శ్రీరామ్ కీలక […]
‘మనం’ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో.. నీతో నేనెంటో.. చూసే చూపేంటో.. మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో’ అంటూ సాగే మ్యాజికల్ […]
నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో హిట్ కొట్టిన ఎం.ఎస్.రాజు తాజా చిత్రమిది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ నిర్మించారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించింది. ‘మాది అస్సాం. మా నాన్న టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు. […]
‘పెళ్ళిచూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం’ వంటి చిత్రాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్న ధృవ ఇప్పుడు మరో అడుగు…. కాదు రెండు అడుగులు ముందుకేశాడు. ‘కిరోసిన్’ అనే సినిమాలో హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం వహించాడు. మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీని దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తెలంగాణా […]
కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా జూన్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక ఇర్రా మోర్ మాట్లాడుతూ ‘మాది ఆగ్రా. నటనపై ఆసక్తితో 2017లో ముంబై చేరినాటకాలు, స్టేజి ప్లేస్ చేశా. ఆ తర్వాత […]
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు నాగ చైతన్యతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను తీయబోతున్నాడు. నాగచైతన్య తమిళంలో చేయబోతున్న డైరెక్ట్ సినిమా ఇదే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 23న ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించబోతున్నట్లు సమాచారం. జూన్ 12న చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ మూవీలో అరుణ్ విజయ్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య […]
అటు తమిళం ఇటు తెలుగులో హాట్ టాపిక్ లోకేశ్ కనకరాజ్. కమల్ హాసన్ తో లోకేష్ తీసిన ‘విక్రమ్’ సినిమా అఖండ విజయం సాధించింది. కమల్ కున్ను అప్పులన్నింటినీ తీర్చిన సినిమాగా ‘విక్రమ్’ నిలిచింది. సందీప్ కిషన్ తో తీసిన ‘మానగరం’, ఆ తర్వాత కార్తీతో ‘ఖైదీ’, విజయ్ తో ‘మాస్టర్’ సినిమాలు సైతం లోకేష్ ప్రతిభకు పట్టం కట్టాయి. ఇప్పుడు ‘విక్రమ్’తో అపజయం ఎరుగని దర్శకుల ఖాతాలో చేరిపోయాడు లోకేష్. దాంతో టాలీవుడ్ లో లోకేష్ […]
ఉద్యమాల పురిటి గడ్డ వరంగల్ నుండి చిత్రసీమకు వచ్చిన వేణు ఊడుగుల తొలి యత్నంగా నాలుగేళ్ళ క్రితం ‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీని తెరకెక్కించాడు. మళ్ళీ ఇప్పుడు ‘విరాట పర్వం’ సినిమాతో జనం ముందుకు రాబోతున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఖమ్మంకు చెందిన తూము సరళ జీవితం ఆధారంగా తెరకెక్కించినట్టు దర్శకుడు వేణు తెలిపాడు. అంతేకాదు… సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ కు వెళ్ళినప్పుడు సరళ కుటుంబ సభ్యులనూ ఈ […]
అంజలి అచ్చ తెలుగు అమ్మాయే, కానీ రచ్చ గెలిచి ఇచ్ఛతో ఇంటికొచ్చి మెప్పించింది. నటిగా అంజలికి రావలసినంత గుర్తింపు రాలేదని తెలుగు అభిమానుల ఆవేదన. ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జనాన్ని మెప్పించడంలో మేటి అనిపించుకుంటోంది అంజలి. టాప్ స్టార్స్ సరసన సైతం నటించి అలరించిన అంజలి విలక్షణమైన పాత్రల్లోనూ సలక్షణంగా అభినయిస్తూ సాగుతోంది. అంజలి 1988 జూన్ 16న తూర్పు గోదావరి జిల్లా రాజోల్ లో జన్మించింది. స్వస్థలంలోనే […]
తెలుగు తెరపై యాక్షన్ క్వీన్ అనిపించుకున్న తొలి నటి విజయలలిత. భారతీయ చలన చిత్రసీమకు ‘ఫియర్ లెస్ నాడియా’ ఎలాగో, తెలుగు తెరకు విజయలలిత అలాగా అంటూ ఆమెను అభిమానులు కీర్తించారు. నర్తకిగా, నటిగా, ఐటమ్ గాళ్ గా, వ్యాంప్ గా విభిన్నమైన పాత్రల్లో మెప్పించారు విజయలలిత. ‘లేడీ జేమ్స్ బాండ్’ అనే పేరూ సంపాదించారు. ఆమె అక్క కూతురు విజయశాంతి. ఆమె కూడా విజయలలితలాగే తన తరం హీరోయిన్స్ లో యాక్షన్ క్వీన్ గా సాగారు. […]