ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కుమారుడు లక్ష్ హీరోగా నటించిన సినిమా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు మూవీకి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని, సినిమా బాగుందంటూ అభినందించారని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందని, ఈ వీడియోకి నెట్టింట […]
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ చేస్తున్నాడు. టీసీరీస్ సంస్థ దాదాపు 500కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణునిగా నటిస్తున్నారు. అయోధ్య నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నిన్న రాత్రి ముంబై, బాంద్రాలోని దర్శకుడు ఓంరౌత్ ఇంట్లో […]
ఎందరో ప్రతిభావంతులు తమదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా రంగంలోనూ రాణిస్తున్నారు. కోరుకున్న తీరాలను చేరుకొని ఆనందిస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు కొరటాల శివ ఒకరు. ఆరంభంలో రచయితగా అలరించన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడయ్యారు. తొలి చిత్రంతోనే జయకేతనం ఎగరేశారు. మొన్న ‘ఆచార్య’తో మొదటి మల్టీస్టారర్ నూ జనం ముందు నిలిపారు. కొరటాల శివ 1975 జూన్ 15న గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. కొరటాల శివలో ప్రతీ అంశాన్ని హేతువాద కోణంలో పరీక్షించే […]
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా పలు చిత్రాలలో నటించాడు. ఇప్పుడు సురేశ్ రెండో కుమారుడు గణేశ్ సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గణేశ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ‘స్వాతి ముత్యం’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం […]
ప్రపంచీకరణతో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఇప్పుడే కాదు ఎల్లలు లేని కళలు ఏ నాడో సాగరాలు దాటి సందడి చేస్తున్నాయి. ఈ సమయంలో మరింతగా కళలు కళకళలాడే పరిస్థితి ఏర్పడింది. సకల కళలకు వేదికగా నిలచిన సినిమా రంగం ఉత్తర, దక్షిణ – తూర్పు, పడమర భేదాలను తుడిచివేయనుందని పరిశీలకులు ఘోషిస్తున్నారు. ప్రపంచ సినిమాను శాసించిన ‘హాలీవుడ్’ చూపు ప్రస్తుతం భారతదేశం వైపు సాగుతోంది. ఇప్పుదే కాదు, తమ కళలకు, కథలకు అనువైన వాతావరణం కోసం హాలీవుడ్ పలుమార్లు […]
ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాత, పంపిణీదారుడు జాక్ మంజునాథ్ ఆరోగ్యానికి సంబంధించిన కర్ణాటకలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణా’కు జాక్ మంజునాథ్ నిర్మాత. దాంతో సుదీప్ తన నిర్మాత ఆరోగ్యానికి సంబంధించి వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జాక్ మంజునాథ్ హాస్పిటల్ లో చేరారని, అయితే అక్కడి సిబ్బంది ఆయన నిద్రపోతున్న ఫోటోలను లీక్ చేయడంతో […]
తమిళంలో శ్రీకాంత్ పేరుతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ప్రస్తుతం తెలుగులో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ మూవీలో హీరోగా నటించాడు. అవికాగోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని అచ్యుత రామారావు, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ జూన్ 24న విడుదల కాబోతోంది. గతంలో దర్శకులుగా మారిన సినిమాటోగ్రాఫర్స్ తో పనిచేసిన అనుభవం గురించి శ్రీరామ్ చెబుతూ, […]
హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ మేరకు ప్రచారపర్వం వేగం అందుకుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు మారుతీ మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్‌తో ఉన్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషించారు. అలాగే రావు రమేష్ […]
ముప్పై తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకొని నలభయ్యో ఏట అడుగుపెట్టినా ఇంకా లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగుతున్నాడు నితిన్. జయాపజయాలకు అతీతంగా నితిన్ పయనం సాగింది. యువతలో నితిన్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నితిన్ ను పరాజయాలు పలకరించినప్పుడు, తప్పకుండా ఈ సారి మా హీరో సక్సెస్ సాధిస్తాడు అనే నమ్మకంతో ఉండేవారు అభిమానులు. అందుకు తగ్గట్టుగానే అనూహ్యంగా నితిన్ ను విజయం వరించేది. త్వరలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో జనం ముందుకు […]
నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన నితిన్ హీరోగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నాడు. నితిన్ నటించిన తొలి చిత్రం ‘జయం’ విడుదలై జూన్ 14తో ఇరవై ఏళ్ళు పూర్తవుతున్నాయి. తేజ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘జయం’ చిత్రం ఆ రోజుల్లో ఘనవిజయం సాధించింది. ‘జయం’ ప్రేమకథతో రూపొందిన చిత్రం. ఫార్ములా చాలా పాతగానే కనిపిస్తుంది. ఓ పేద అబ్బాయి, కలవారి అమ్మాయిని ప్రేమించడం, ప్రేమను గెలిపించుకోవడంలో ఇక్కట్లు ఎదురవ్వడం, వాటిని దాటుకొని చివరకు […]