‘మనం’ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో.. నీతో నేనెంటో.. చూసే చూపేంటో.. మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో’ అంటూ సాగే మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
చక్కటి మెలోడి సాంగ్‌గా అందర్ని ఆకట్టుకుంటున్న ఈ పాటకు ప్రముఖ గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జోనిత గాంధీ ఆలపించారు. సంగీత దర్శకుడు తమన్ స్వరాలను అందించారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు. జూలై 8న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.