ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. బాలకృష్ణ ‘అఖండ’కు తమన్ నేపథ్యసంగీతం ఎంతో ప్లస్ అయింది. దాంతో ‘రాధేశ్యామ్’ కి తమన్ ని తీసుకున్నారు. అయితే సినిమా డిజాస్టర్ అయింది. అందరు హీరోలతో హిట్స్ ఉన్న తమన్ కి ఇది నిరాశ కలిగించే అంశమే. ఇప్పుడు ప్రభాస్ తో మరోసారి పని చేసే అవకాశం లభించింది. దర్శకుడు మారుతీతో ప్రభాస్ తో తీయబోయే హారర్ […]
యూత్ లో ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. ఇక విడాకులు తీసుకున్నా దక్షిణాదిన ఏ మాత్రం ఫామ్ కోల్పోని హీరోయిన్ సమంత. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమానే ‘ఖుషి’. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మైత్రీ మూవీస్ సంస్థ శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా […]
రాహుల్ విజయ్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ జరుపుకున్న చిత్ర బృందం ఇటీవల మలి షెడ్యూల్ కోసం గోవా వెళ్ళింది. అక్కడే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని గుమ్మడి కాయ కూడా కొట్టేసింది. ఈ చిత్రానికి మేఘా ఆకాశ్ తల్లి బిందు ఆకాశ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ. […]
తెలుగులో నాని నటించిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశారు. అమన్ గిల్ తో కలిసి ‘దిల్’ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ ఉత్తరాది ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. నిజానికి ‘కేజీఎఫ్ -2’తో పాటే ఏప్రిల్ 14న ‘జెర్సీ’ని విడుదల చేయాలని ముందు అనుకున్నా, ఎందుకైనా మంచిదని ఓ వారం ఆలస్యంగా 22న రిలీజ్ చేశారు. అయినా ప్రతికూల ఫలితమే ‘జెర్సీ’కి లభించింది. ‘కబీర్ సింగ్’ […]
తెలుగు సినిమా ఆరంభంలో నాటకాల్లో నటించిన వారినే కెమెరా ముందూ నటింప చేసేవారు. ఇప్పటికీ కొందరు నాటకాల వారిని తెరపై చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే రూపురేఖలనే మార్చే సే రోజులు వచ్చాయి కానీ, ఆ రోజుల్లో పాత్రకు తగ్గ రూపం, అందుకు తగ్గ అభినయం, వాటిని మించిన వాచకం తప్పని సరిగా నటీనటులకు ఉండాల్సిందే! తెలుగునేలపై పలు నాటకాల ద్వారా నటిగా తనను తాను నిరూపించుకున్న వెల్లాల సుబ్బమ్మ; తరువాతి రోజుల్లో శాంతకుమారిగా తెరపై […]
ఛార్మి అందం హిందోళం పాడేది. ఆమె అధరం తాంబూలం సేవించమనేది. ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ వచ్చీ రాగానే జనాన్ని ఆకట్టుకుంది. కేవలం పదిహేనేళ్ళ వయసులోనే కెమెరా ముందు నిలచి, నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఛార్మి. అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి. ఛార్మి కౌర్ 1987 మే 17న పంజాబ్ లోని లూధియానాలో జన్మించింది. ఛార్మికి సినిమాల్లో […]
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంది. జూన్ 3న ఈ చిత్రాన్ని ఈ రెండు భాషలతో పాటు మలయాళంలోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా అతని […]
పాన్ ఇండియా సినిమాలకు స్టార్స్ పేర్లు జత చేయడం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి దక్షిణాదిలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తారని ఆ మధ్య చిత్ర నిర్మాత కరణ్ జోహార్ తెలిపారు. అలానే పలు తెలుగు సినిమాలకూ ఆయన ఉత్తరాదిన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదే ధోరణిలో కన్నడ చిత్రసీమ కూడా సాగుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ప్రతిష్ఠాత్మక త్రీడీ చిత్రం ‘విక్రాంత్ […]
గాయకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. సంగీత దర్శకుడిగా నటుడిగా తన అనుభవాలను ‘ఐ యామ్ ఏ సెలబ్రిటీ’ పేరుతో లిరిక్ అందించి, సంగీత దర్శకత్వం వహించి తనే పాడిన పాటను తెలుగు వీక్షకులకు అందించాడు. ఈ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా రఘు కుంచే మాట్లాడుతూ ‘ప్రతి మనిషికి సమాజంలో మంచి గుర్తింపు కావాలని ఉంటుంది. కానీ కొందరికే వస్తుంది. […]
సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ ఇటీవల కాలంలో వరుసగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తోంది. ఇటీవల ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నయన్ తాజాగా ‘O2’ అనే సినిమాతో రానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమాకు విఘ్నేష్ దర్శకుడు. డిస్నీ+ హాట్ స్టార్ లో రాబోతున్న ఈ సినిమా […]