తెలుగులో నాని నటించిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశారు. అమన్ గిల్ తో కలిసి ‘దిల్’ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ ఉత్తరాది ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. నిజానికి ‘కేజీఎఫ్ -2’తో పాటే ఏప్రిల్ 14న ‘జెర్సీ’ని విడుదల చేయాలని ముందు అనుకున్నా, ఎందుకైనా మంచిదని ఓ వారం ఆలస్యంగా 22న రిలీజ్ చేశారు. అయినా ప్రతికూల ఫలితమే ‘జెర్సీ’కి లభించింది.
‘కబీర్ సింగ్’ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో షాహిద్ కపూర్ ఈసారి విఫలమయ్యాడు. అయితే ఇప్పుడీ సినిమాను ఈ నెల 20న ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. విశేషం ఏమంటే… ఈ శుక్రవారం ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. తెలుగులో అయితే ‘ఆచార్య’, ‘భళా తందనాన’ చిత్రాలూ 20వ తేదీనే డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవి కాకుండా పది పదిహేను వెబ్ సీరిస్ లు, వివిధ భాషా చిత్రాలు సైతం వీక్షకుల ముందుకు ఈ శుక్రవారం రాబోతున్నాయి.