ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సెట్స్ లోనే కాదు విడిగానూ సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే ప్రభాస్ అతిథ్యాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇటీవల నాగ్ అశ్విన్ తన ట్వీట్ లో ప్రభాస్ ని మెచ్చుకోవడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే ‘ప్రాజెక్ట్ కె’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ రూపొందుతోంది. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ‘ప్రాజెక్ట్ కె’ కి సంబంధించి రెండు […]
సుధాకర్ వాచకం, అభినయం విలక్షణంగా ఉండి పలు చిత్రాల్లో నవ్వులు పూయించాయి. కొన్ని చిత్రాలలో హీరోగానూ, విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు సుధాకర్. చిత్రమేమంటే మాతృభాష తెలుగులో కంటే ముందుగానే తమిళనాట హీరోగా విజయకేతనం ఎగురవేశారు సుధాకర్. ఆపై డైలాగులు వైవిధ్యంగా వల్లిస్తూ, తనదైన మేనరిజమ్ తో కామెడీ రోల్స్ లో భలేగా ఆకట్టుకున్నారు. సుధాకర్ 1959 మే 18న జన్మించారు. రాయలసీమకు చెందిన వారు. ఆయన తండ్రి డిప్యూటీ కలెక్టర్. దాంతో పలు చోట్ల సుధాకర్ […]
భారతీయ పురాణ, ఇతిహాసాలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందునా నటరత్న యన్.టి.రామారావు నటించిన అనేక పౌరాణిక చిత్రాలు ఆబాలగోపాలానికి పురాణాల్లో దాగిన పలు అంశాలను విప్పి చెప్పాయి. అలాంటి చిత్రమే ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’. నిజానికి ఈ కథ పురాణాల్లో కనిపించక పోయినా, శ్రీరాముడు వైకుంఠయానం చేసేటపుడు ఆంజనేయుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే తనతో పాటు తన భక్తుని తీసుకువెళ్ళేవాడు కదా అనే వాదన ఉన్నది. అందునిమిత్తమై, రామాయణంలోని కొన్ని అంశాలను ఆంజనేయునికి రాముడే దేశబహిష్కరణ విధించేలా […]
అందాలు ఆరబోయడంలోనూ, అందుకు తగ్గ అభినయం ప్రదర్శించడంలోనూ కంగనా రనౌత్ సదా అభినందనలు అందుకుంటూనే ఉంటుంది. అంతలేంది… జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలుస్తుందా చెప్పండి! కేవలం నటనతోనే కాదు, తనకు చాలాకాలంగా అలవాటయిన వెటకారంపైనా కంగనాకు ఎంతో మమకారం ఉందని మరోమారు తేలిపోయింది. అవకాశం చిక్కితే చాలు తారల వారసులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో కంగనా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అనన్య పాండేపై కంగనా ఓ సెటైర్ వేసి మళ్ళీ వార్తల్లో నిలచింది. చాలా రోజులుగా ‘నెపోటిజమ్’పై […]
విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తాజా చిత్రం ‘అవతార్-2’ డిసెంబర్ 16న జనం ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘అవతార్’ చిత్రం 2009లో తొలిసారి జనం ముందు నిలచి, ఆ యేడాది టాప్ గ్రాసర్ గా నిలవడమే కాదు, ఈ నాటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రాలలో నంబర్ వన్ గా చెక్కుచెదరకుండా ఉంది. ‘అవతార్’ సినిమాతోనే ప్రపంచ వ్యాప్తంగా 3డి […]
షర్మిలా టాగోర్ ఒకప్పుడు ఆసేతు హిమాచల పర్యంతం అభిమానగణాలను సంపాదించి, ఎందరో రసికుల కలలరాణిగా జేజేలు అందుకున్నారు. షర్మిల నటించిన ప్రేమకథా చిత్రాలు చూసి, ఆమె వీరాభిమానులుగా మారినవారెందరో! ఆమెపై అభిమానంతో తమ ఆడపిల్లలకు ‘షర్మిల’ అని నామకరణం చేసిన వారూ లేకపోలేదు. అంతలా ఆ రోజుల్లో అభిమానులను ఆకట్టుకున్న షర్మిలకు ప్రస్తుతం 75 ఏళ్ళ వయసు. ఆమె తనయుడు సైఫ్ అలీఖాన్, కూతురు సోహా అలీఖాన్ సైతం తల్లి బాటలో పయనించి, నటులుగా అలరించారు. అందులో […]
పాలిటిక్స్, సినిమా, క్రికెట్, స్పోర్ట్స్- వీటి చుట్టూ పలు కొత్త పదాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఈ నాలుగు అంశాలలో చోటు చేసుకున్న కరెంట్ టాపిక్స్ కు అనుగుణంగా ‘అమూల్’ సంస్థ తమ ప్రచార పర్వంలో పదాలతో పదనిసలు పలికిస్తూ ఉంటుంది. హాలీవుడ్ జంట జానీ డెప్, అంబర్ హెర్డ్ విడిపోయి, నాలుగేళ్ళు దాటింది. అయితే ఓ టీవీ ప్రోగ్రామ్ లో జానీ డెప్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో, అతను తనను మానసికంగా, భౌతికంగా ఎంతలా […]
‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ నిజంగానే ఆ పేరు సార్థకం చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సినిమాల సక్సెస్, వాటి కలెక్షన్స్ ను కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడంది. పైగా విషపూరిత ప్రచారాలకు సోషల్ మీడియా వేదికగా మారి చాలా రోజులయింది. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాను నటించిన మూడు రీమేక్ మూవీస్ ను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకోవడం […]
కంటెంట్ లో కాస్తంత దమ్ము ఉండాలే కానీ హారర్ థ్రిల్లర్స్ ను ఇప్పటికీ జనం ఆదరిస్తూనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఆ జానర్ లో నరసింహ జీడీ ‘నఘం’ అనే సినిమాను తెరకెక్కించారు. గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శివ దోసకాయల నిర్మించారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘నఘం’ మూవీ టీజర్ ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు […]
ముప్పై సంవత్సరాల వయసులో చేంబోలు సీతారామశాస్త్రి… ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అయ్యారు. ఆ తర్వాత ముప్పై వసంతాలకు ‘పద్మశ్రీ’ సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారు. గత యేడాది నవంబర్ 30న కన్నుమూసే వరకూ ఆయన పాటతోనే ప్రయాణించారు. పాటనే పలవరించారు. తెలుగు సినిమా పాటకు సాహితీ గౌరవాన్ని కలిగించిన సీతారామశాస్త్రి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో అభిమానం. మే 20 ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పుట్టిన రోజు. ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో తానా ప్రపంచ సాహిత్య వేదిక […]