Nayanthara : విడుదలైన నయన్ ‘O2’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ ఇటీవల కాలంలో వరుసగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తోంది. ఇటీవల ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నయన్ తాజాగా ‘O2’ అనే సినిమాతో రానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమాకు విఘ్నేష్ దర్శకుడు. డిస్నీ+ హాట్ స్టార్ లో రాబోతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ప్రమాదంలో మిస్ అయిన ఓ బస్సులో ప్రయాణీకులు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతుంటారు. మరి మిస్ అయిన ఆ బస్సు ని కనిపెట్టగలిగారా? ప్రయాణీకులలో ఉన్న నయనతార ఏం చేసింది? ఇదే సినిమా కథాంశం. నిజానికి ముందు ఈ సినిమాకు ‘ఆక్సిజన్’ అనే టైటిల్ అనుకున్నా… ఇంగ్లీష్ పదాలతో అయితే ఈజీగా ఆడియన్స్ కి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ‘O2’ అని పెట్టారు. ఇంతకు ముందు కూడా నయన్ నటించిన ‘నేత్రికన్’ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీహాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలయింది. అది తెలుగులో ‘త్రినేత్ర’ పేరుతో అనువాదం అయింది. ఇప్పుడు ఈ ‘O2’ ను కూడా డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ పలు భాషల్లో ఓకే సారి ఈ సినిమా విడుదల కానుంది. టీజర్ తో ఆకట్టుకున్న నయన్ సినిమాతో ఎంతగా మురిపిస్తుందో చూడాలి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు