Asaduddin Owaisi: హుమాయున్ కబీర్‌తో పొత్తు ఎంఐఎం సిద్ధం.. బెంగాల్‌లో మమతక్క కష్టమే..
- హుమాయున్ కబీర్‌తో ఎంఐఎం పొత్తుకు సిద్ధం..
- బెంగాల్ రాజకీయాల్లో కీలక రాజకీయ పరిణామాలు..
- ఇటీివల బాబ్రీ మసీదు శంకుస్థాపనతో కబీర్ వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల, ముర్షిదాబాద్‌లోని బెల్దంగా ప్రాంతంలో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మిస్తానని చెప్పి, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ వివాదంతో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కబీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై, కబీర్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీ మాజీ సీఎం అవుతారని అన్నారు. ముస్లింల ఓట్ బ్యాంక్‌ను కోల్పోతారని చెప్పారు.
Read Also: Pakistan: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతం.. మీరు వింటున్నది నిజమే..
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
వచ్చే ఎన్నికల నాటికి కొత్త పార్టీని ఏర్పాటు చేసి, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై ఎంఐఎం పశ్చిమ బెంగాల్ యూనిట్ స్పందించింది. పొత్తుపై ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం, రెండు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, బెంగాల్‌లో సీట్లలో పొత్తు కుదురుతుందని ఎంఐఎం బెంగాల్ చీఫ్ ఇమ్రాన్ సోలంకి చెప్పారు. తాను హుమాయున్ కబీర్‌తో మాట్లాడానని, ఓవైసీకి దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న కారణంగా ఎంఐఎంతో పొత్తును కోరుకుంటున్నారని, మేము కూడా కబీర్‌తో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నానని, అయితే తుది నిర్ణయం ఓవైసీ తీసుకుంటారని ఇమ్రాన్ చెప్పారు.
టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన కబీర్, మమతా బెనర్జీకి కీలకంగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్‌ను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ కావాలని ఆశిస్తున్నారు. డిసెంబర్ 22న తన సొంత పార్టీని ప్రారంభిస్తారని చెప్పారు. మైనారిటీ ఓట్లతో గెలిచినప్పటికీ, మమతా వారిని నిర్లక్ష్యం చేసినట్లు ఇమ్రాన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!