Shantha kumari :నాటి మేటి నటి శాంతకుమారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఆరంభంలో నాటకాల్లో నటించిన వారినే కెమెరా ముందూ నటింప చేసేవారు. ఇప్పటికీ కొందరు నాటకాల వారిని తెరపై చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే రూపురేఖలనే మార్చే సే రోజులు వచ్చాయి కానీ, ఆ రోజుల్లో పాత్రకు తగ్గ రూపం, అందుకు తగ్గ అభినయం, వాటిని మించిన వాచకం తప్పని సరిగా నటీనటులకు ఉండాల్సిందే! తెలుగునేలపై పలు నాటకాల ద్వారా నటిగా తనను తాను నిరూపించుకున్న వెల్లాల సుబ్బమ్మ; తరువాతి రోజుల్లో శాంతకుమారిగా తెరపై ఓ వెలుగు వెలిగారు. ఆమె భర్త ప్రముఖ దర్శకులు పి.పుల్లయ్య. ఈ దంపతులు ‘పద్మశ్రీ’ పతాకంపై కొన్ని చిత్రాలనూ నిర్మించారు. పుల్లయ్య, శాంతకుమారి దంపతులు చిత్రసీమలో ప్రవేశించిన కొత్తవారిని ఎంతగానో ప్రోత్సహించేవారు. అందువల్ల ఆ దంపతులను అందరూ ‘అమ్మానాన్న’గా భావించేవారు. శాంతకుమారిని ‘మమ్మీ’ అని, పుల్లయ్యను ‘డాడీ’ అంటూ అభిమానంగా పిలిచేవారు.
శాంతకుమారి 1920 మే 17న రాయలసీమలోని ప్రొద్దుటూరులో జన్మించారు. బాల్యంలోనే ఆమె హావభావాలు చూసి, నటిగా భలే రాణిస్తుందనే వారు. ఇంట్లోనే పురాణాలను భట్టీయం వేసిన ఆమె రంగస్థలంపై గుక్క పోకుండా సంబాషణలు, పద్యాలు చెప్పే తీరు, నటించిన వైనం చూసి జనం జేజేలు పలికారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన శాంతకుమారి మద్రాసులోని ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్ కావాలని వెళ్ళారు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. సాలూరు రాజేశ్వరరావుతో కలసి కొన్ని లలిత గీతాలు పాడారు. తరువాత విద్యోదయ పాఠశాలలో సంగీతం నేర్పేందుకు నెలకు రెండు రూపాయల జీతంపై చేరారు. అదే సమయంలో ‘శశిరేఖా పరిణయం’లో శశిరేఖగా నటించే అవకాశం ఆమెకు లభించింది. చిత్రసీమలో అడుగు పెట్టగానే సుబ్బమ్మ కాస్తా శాంతకుమారిగా మారిపోయారు. ఆ తరువాత పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘సారంగధర’లో చిత్రాంగిగా నటించి మెప్పించారు శాంతకుమారి. ఆ సినిమా పూర్తి కాగానే శాంతకుమారి, పుల్లయ్య పెళ్ళాడారు. భర్త పి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాలాజీ’ చిత్రంలో పద్మావతిగా నటించి అలరించారు. అదే కథ తరువాతి రోజుల్లో ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’గా యన్టీఆర్ తో పుల్లయ్య రూపొందించారు. ఈ చిత్రంలో వకుళామాతగా శాంతకుమారి తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. అలాగే 1937లో రూపొందిన ‘సారంగధర’లో చిత్రాంగిగా నటించిన శాంతకుమారి, 1957లో తెరకెక్కిన ‘సారంగధర’లో రత్నాంగిగా నటించడం విశేషం! “ధర్మపత్ని, పార్వతీకళ్యాణం, కృష్ణప్రేమ” వంటి చిత్రాలలో నాయికగా నటించి ఆకట్టుకున్నారామె. చిత్రమేమంటే తన కంటే వయసులో నాలుగేళ్ళు చిన్నవాడయిన ఏయన్నార్ కు నాయికగా ‘మాయాలోకం’లో నటించారు శాంతకుమారి. ఆ తరువాత అనేక చిత్రాలలో ఏయన్నార్ కు తల్లిగా అభినయించారామె. ఆ రోజుల్లో యన్టీఆర్, ఏయన్నార్ వంటి హీరోలకు పలు చిత్రాలలో తల్లిగా నటించి ఆకట్టుకున్నారామె.
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
యన్టీఆర్ తొలి ద్విపాత్రాభినయ చిత్రం ‘రాముడు-భీముడు’లో ఆయనకు అక్కగా నటించారు శాంతకుమారి. నాయికగా నటించిన రోజుల్లో తన పాటలు తానే పాడుకొనేవారామె. తరువాతి రోజుల్లోనూ కొందరు శాంతకుమారి పాత్రలకు ఆమెతోనే పాటలు పాడించారు. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘తల్లా పెళ్ళామా’లో శాంతకుమారిని తల్లి పాత్రలో నటింప చేశారు. అందులో హరికృష్ణకు తినిపిస్తూ, “మమతలెరిగిన నా తండ్రి…” అనే పాటను శాంతకుమారి స్వయంగా గానం చేశారు. తన ఓపిక ఉన్నన్ని రోజులు నటించారామె. సినిమాలలో నటించడం మానేసిన తరువాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను రాసి, స్వరపరిచేవారు శాంతకుమారి. 1981లో పి.పుల్లయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించగా, 1999లో శాంతకుమారికి కూడా వెంకయ్య అవార్డు దక్కింది. ఇలా భార్యాభర్తలు ఒకే అవార్డును అందుకోవడం అన్నది విశేషం! దాదాపు నాలుగు దశాబ్దాలు నటిగా కొనసాగిన శాంతకుమారి 2006 జనవరి 16న తుదిశ్వాస విడిచారు. ఈ నాటికీ శాంతకుమారి నటించిన చిత్రాలు బుల్లితెరపై ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఆమె అభినయం నవతరాన్నీ సైతం ఆకట్టుకుంటూనే ఉంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!