Off The Record: కొత్త పంధాలో ఉండవల్లి అరుణ్ కుమార్..? బీజేపీ మీదికి ఫోకస్ షిఫ్ట్..!
- కొత్త పంథాలో ఉండవల్లి అరుణ్‌కుమార్?..
- బీజేపీ మీదికి ఫోకస్ షిఫ్ట్..
- పబ్లిసిటీ కోసమా? వేరే ప్రయోజనాలు ఆశిస్తున్నారా?..
- ఉప రాష్ట్రపతి ఎన్నిక టైంలో ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలపై విమర్శలు..
- సనాతన ధర్మాన్ని బీజేపీనే చెడగొడుతోందని తాజా వ్యాఖ్యలు..
- పర్సనల్ పబ్లిసిటీ, కాంగ్రెస్‌కు మేలు టార్గెట్టా?..
- తిరిగి సొంత గూటికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారా?..
- ఉనికి కోసమే ఆర్ఎస్‌ఎస్‌పై సవాళ్ళన్న చర్చలు..
- ఉండవల్లికి సోము వీర్రాజు కౌంటర్, బహిరంగ చర్చకు సవాల్..
- మత పరంగా సున్నిత అంశంపై చర్చకు పోలీసులు అనుమతిస్తారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త పంథా ఎంచుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సాధారణంగా ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే ఆ లోతుల్లోకి వెళ్ళి తవ్వకాలు జరిపి అవశేషాలను కూడా వెలికి తీస్తుంటారు. అవతలోళ్ళని గిల్లి గిచ్చి… ఓరి బాబోయ్…. వద్దు. నీకో దండం అనేలా చేస్తుంటారన్నది విస్తృతాభిప్రాయం. ఆ క్రమంలోనే ఇప్పుడు తన ఫోకస్ బీజేపీ మీదికి షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. వ్యక్తిగా ఉండవల్లి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఢీ కొట్టడం అంత తేలికైన విషయమేం కాదు. అయినాసరే… సైసై చర్చకు సిద్ధమంటూ తొడగొట్టడం ఆసక్తి రేపుతోంది. దీని వెనక పబ్లిసిటీ యావ ఉందా? లేక వేరే ప్రయోజనాలు ఆశిస్తున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. రెండు నెలల క్రితం ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ఆ సందర్భాన్ని వాడుకుని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై తీవ్ర విమర్శలు చేశారాయన. తాజాగా డిసెంబర్ 6న బాబ్రీ ఉదంతాన్ని గుర్తు చేస్తూ…బీజేపీ హిందుత్వ విధానాలను విమర్శించారు. అసలు సనాతన ధర్మాన్ని బీజేపీనే చెడగొడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ.
గతంలో ఆర్ఎస్ఎస్ వాదిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. .ఆ సిద్ధాంతాలు నచ్చకే తాను బయటికి వచ్చానని చెబుతున్నారు. ఇప్పుడు ఏదో ఒక సందర్భం చూసుకుని, ఇంకేదో కారణం చెబుతూ… ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతాల గురించి చర్చ పెట్టడమంటే… పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతివ్వడమేనన్నది రాజకీయవర్గాల విశ్లేషణ. గతంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ఉండవల్లి… రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు, పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అయినాసరే… పాత వాసనలు పోక… ఇప్పుడు ఏదో రకంగా బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంలపై చర్చ పేరుతో ఒక రచ్చ లేపి తన వ్యక్తిగత పబ్లిసిటీతో పాటు కాంగ్రెస్‌కు మేలు జరిగేలా తనవంతు సహకారం అందించాలనుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇలాంటి వ్యాఖ్యలతో ఉండవల్లి తిరిగి సొంత గూటికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారా అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట కొందరికి. అదే సమయంలో మరోసారి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని ఆయన చెప్పిన మాటల్ని సైతం గుర్తు చేసుకుంటున్నా…. ఏమో, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీ కంట్రోల్‌లో ఉన్నాయని ఉండవల్లి తరచూ చెబుతుంటారు. ఆ మూడు పార్టీలు ఎలాగూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేవు కాబట్టి… ఆ రోల్ తాను తీసుకోవాలని మాజీ ఎంపీ అనుకుంటున్నారా అన్నది ఇంకొందరి అనుమానం.
Also Read
మరోవైపు… కామ్‌గా ఉంటే మనల్ని ఎవరు పట్టించుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడితే కదా… ఉనికిలో ఉండేదన్న ఉద్దేశ్యంతోనే ఇప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలంటూ కొత్త పల్లవి అందుకున్నారని అనే వాళ్ళు సైతం లేకపోలేదు. అటు ఉండవల్లి వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో బిజెపి శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఏపీ లీడర్స్ స్పందన ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు రాజమండ్రికే చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారాయన. అందుకు అరుణ్‌కుమార్ కూడా సై అనడంతో ఆసక్తి పెరిగింది. బహిరంగ చర్చకు వేదికను ఎక్కడ ఖరారు చేయాలన్న విషయమై సోము వీర్రాజు ట్రయల్స్ వేశారట కూడా. కానీ… ఇంకా చర్చ మాత్రం జరగలేదు. తాజాగా ఉండవల్లి మరోసారి తీవ్ర విమర్శలు చేయడంతో సోము కూడా రంగంలోకి దిగుతారా? లేక లైట్ తీసుకుంటారా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజమండ్రిలో. సై అంటే సైసై అనుకుంటూ ఒకవేళ వీళ్లిద్దరూ తొడలు కొట్టుకున్నా… మత పరంగా సున్నితమైన అంశం కావడంతో… అసలు పోలీసులు అనుమతిస్తారా అన్నది అన్నిటికంటే పెద్ద అనుమానం. మొత్తం మీద రాజమండ్రి ముదురు నాయకుల రగడకు ముగింపు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!