Charmy Kaur :అప్పుడు… ఇప్పుడు… ఛార్మి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛార్మి అందం హిందోళం పాడేది. ఆమె అధరం తాంబూలం సేవించమనేది. ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ వచ్చీ రాగానే జనాన్ని ఆకట్టుకుంది. కేవలం పదిహేనేళ్ళ వయసులోనే కెమెరా ముందు నిలచి, నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఛార్మి. అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి.
ఛార్మి కౌర్ 1987 మే 17న పంజాబ్ లోని లూధియానాలో జన్మించింది. ఛార్మికి సినిమాల్లో నటించాలన్న అభిలాష కలగగానే, ప్రయత్నాలు మొదలు పెట్టింది. అదృష్టం ఆమె తలుపును దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపంలో తట్టింది. భీమనేని నిర్మించి, దర్శకత్వం వహించిన ‘నీ తోడు కావాలి’తో ఛార్మి నటిగా వెలుగు చూసింది. ‘నీ తోడు కావాలి’లో మానస పాత్రలో భలేగా నటించి ఆకట్టుకుంది ఛార్మి. ఆ సమయంలో ఛార్మి వయసు కేవలం పదిహేను సంవత్సరాలే! తరువాత హిందీ, తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లోనూ సాగింది. కానీ, నటిగా ఆమెకు గుర్తింపు సంపాదించి పెట్టినవి తెలుగు చిత్రాలే అని చెప్పాలి. కృష్ణవంశీ ‘శ్రీఆంజనేయం’లో ఛార్మి అందం ఆ నాటి కుర్రకారుకు గంధం పూసింది.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
‘మాస్’లో నాగార్జునతో మజాగా చిందేసింది. ‘అల్లరి పిడుగు’లో బాలకృష్ణతో తకధిమితై అంటూ ఆడింది. ‘లక్ష్మీ’లో వెంకటేశ్ తో పసందుగా సాగింది. టాప్ స్టార్స్ తో నటించి, విజయాలను చూసినా, వారి చిత్రాల్లో ఛార్మి సైడ్ హీరోయిన్ గానే వెలిగింది తప్ప, సోలో హీరోయిన్ గా మురిపించలేకపోయింది. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చక్రం, రాఖీ’ చిత్రాలతోనూ నటిగా మంచి మార్కులు సంపాదించింది. ప్రభాస్ ‘పౌర్ణమి’లో ఛార్మి మరపురాని పాత్రనే ధరించింది. కొన్ని చిత్రాలలో అతిథి పాత్రల్లోనూ మురిపించింది, ప్రత్యేక గీతాల్లోనూ అలరించింది. లేడీ ఓరియెంటెండ్ మూవీస్ “మంత్ర, మంగళ, అనుకోకుండా ఒక రోజు”లలో తనదైన బాణీ పలికించింది ఛార్మి. హిందీలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బుడ్డా… హోగా తేరా బాప్’లో అమితాబ్ బచ్చన్ తోనూ కలసి నటించింది. ‘మంత్ర’గా తనదైన అభినయంతో ఉత్తమనటిగా నంది అవార్డును సొంతం చేసుకున్న ఛార్మి ఆపై కూడా కొన్ని చిత్రాలలో ముద్దు ముద్దుగా మురిపించింది. కృష్ణవంశీ ‘చందమామ’లో కాజల్ కు ఛార్మి గాత్రం కూడా అందించింది.
ఛార్మి అందం మందమైనా, ఆమెలోని చలాకీ తనాన్ని ఇప్పటికీ ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. పూరి జగన్నాథ్ ‘జ్యోతిలక్ష్మి’ లో వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకుంది ఛార్మి. ఈ సినిమాతోనే నిర్మాణభాగస్వామిగా తన రూటు మార్చింది. పూరి జగన్నాథ్ తో ఏర్పడిన పరిచయంతో ‘పూరి కనెక్ట్స్ ‘ బ్యానర్ లో ఛార్మి కూడా నిర్మాణభాగస్వామిగా కొనసాగుతోంది. ఈ బ్యానర్ తో మరికొందరు నిర్మాతలతోనూ కలసి చిత్రాలను నిర్మించింది. బాలకృష్ణ ‘పైసా వసూల్’, రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, పూరి తనయుడు ఆకాశ్ నటించిన ‘మెహబూబా’ చిత్రాల నిర్మాణంలో ఛార్మి భాగస్వామి. విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘లైగర్’ నిర్మాణంలోనూ ఛార్మి పాలు పంచుకుంది. భవిష్యత్ లో తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తానని అంటున్న ఛార్మి, మళ్ళీ ఎప్పుడు తెరపై తళుక్కుమంటుందో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి!
తాజావార్తలు
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!