ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ స్ర్టీమింగ్ హక్కులను జీ5 కొనుగోలు చేసి 20వ తేదీనుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రేజీ సినిమా కోసం పే ఫర్ వ్యూ పద్దతిని అనుసరించాలని ముందు అనుకుంది జీ5. అయితే ఇప్పుడా ఆలోచన విరమించుకుని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తన సబ్ స్క్రైబర్స్ కి ఉచితంగానే చూపించబోతోంది. దీనికి కారణం మరో ఓటీటీ లో మరో సూపర్ […]
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ నటీనటుల సందడి ఇంతా అంతా కాదు! దీపికా పదుకునే, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా వంటి అందాల భామలు ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను తొలిసారి పాల్గొన్నానని చెప్పిన తమన్నా… ఆ అవకాశం తనకు కల్పించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ధన్యవాదాలు తెలిపింది. ‘బాహుబలి’ సినిమాతో […]
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 3న విడుదల కాబోతోంది. ఇటీవల ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు దర్శక నిర్మాతలు అందులో భాగంగా బుధవారం సాయంత్రం ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘ఓహ్ ఇషా’ అనే పాట రిలికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఒక గెట్ టు గెదర్ లో ఆర్మీ అధికారులు […]
వెర్సటైల్ హీరో సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 17వ తేదీ ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సి. కళ్యాణ్ ప్రకటించారు. ఐశ్వర్యలక్ష్మీ నాయికగా నటించిన ‘గాడ్సే’లో నాజర్, షాయాజీ షిండే, కిశోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ మూవీని తెరకెక్కించిన గోపీ గణేశ్ ఇప్పుడీ ‘గాడ్సే’ను డైరెక్ట్ చేశాడు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడితో పోరాడే యువకుడి […]
ఫాంటసీ, థ్రిల్లర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమా ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. సంపత్ కుమార్ దర్శకత్వంలో మట్ట మధు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. హీరో తాను చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను ఎలా ఎదురుకున్నాడు అనే కథాంశాన్ని థ్రిల్లింగ్ గా హాస్యాన్ని జోడించి చూపించామని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని , జూన్ 10 వ తారీఖున […]
తెలుగు సినిమా హిట్ అయిందో? లేదో తెలియాలంటే ఒకప్పుడు నంబరాఫ్ డేస్, సెంటర్స్, కలెక్షన్స్ ప్రామాణికంగా ఉండేవి. అయితే కాలక్రమేణా సినిమాల రన్ తగ్గి వసూళ్ళు క్రైటీరియాగా మారాయి. దాంతో ఇప్పుడు కలెక్షన్స్ రికార్డుల ముచ్చటే సాగుతోంది. ఇక ఇప్పుడైతే ఏకంగా తొలి రోజు ఎంత కలెక్ట్ చేసింది… వీకెండ్ లోపు ఎంత వసూలు చేసింది.. ఇదే ప్రధానంగా మారింది. అసలు సినిమాకు క్రేజ్ రావాలంటే ఏం చేయాలనే విషయంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. క్రేజీ […]
ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత ‘దిల్’ రాజును మించిన వారు లేరు. గత కొంతకాలంగా ఇటు తెలంగాణాలోనూ, అటు ఆంధ్రాలోనూ పెద్ద సినిమాలు విడుదలైతే చాలు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, సినిమా టిక్కెట్ రేట్లును నిర్మాతలు పెంచుకుంటున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ లాంటి భారీ బడ్జెట్ మూవీ విషయంలో ఇది సమంజసమే కానీ ఇతర చిత్రాల టిక్కెట్ రేట్లనూ పెంచి అమ్మడం ఎంతవరకూ కరెక్ట్ అనే వాదన ఒకటి వచ్చింది. పాన్ ఇండియా సినిమాల […]
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్. రెహమాన్ ఇప్పుడు సినిమా రంగంతో పూర్తి స్థాయిలో మమేకం అయిపోయాడు. ఇటీవల ’99 సాంగ్స్’ అనే పాన్ ఇండియా మూవీని నిర్మించి, విడదల చేసిన రెహమాన్, తాజాగా వర్చువల్ రియాలిటీ మూవీ ‘లే మాస్క్’ను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను ప్రస్తుతం జరుగుతున్న కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. 75 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని అక్కడి వ్యూవర్స్ కోసం 36 నిమిషాలకు […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ వచ్చే నెలలో లండన్ లో జరగనుంది. ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషించడానికి కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్‌ని ఎంపిక చేశారట. ఇటీవల విడుదలై హిట్ అయిన శివకార్తికేయన్ ‘డాక్టర్’లో విలన్ గా అందరినీ ఆకట్టుకున్నాడు వినయ్‌రాయ్. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాను నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై […]
ఈ నెల 15వ తేదీ ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ ద్వితీయ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2008లో మోనికాను ప్రేమ వివాహం చేసుకున్న ఇమ్మాన్ గత యేడాది డిసెంబర్ లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే తాజాగా చేసుకున్నది పెద్దలు కుదిర్చిన వివాహమని చెబుతూ, ఆ విషయమై తన మనసులోని భావాలను ఇమ్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ స్వర్గీయ ఉబల్డ్, చంద్ర ఉబల్డ్ కుమార్తె అమలీతో తన […]