‘కె.జి.ఎఫ్’ సీరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ యశ్. దీంతో యవ్ నటించిన కన్నడ చిత్రాలను ఇతర భాషల్లో అనువదించి విడుదల చేస్తున్నారు. అలా వస్తున్న చిత్రమే ‘లక్కీస్టార్’. 2012లో కన్నడలో ‘లక్కీ’ పేరుతో విడుదలైన యశ్ సినిమాను ఆ చిత్ర నిర్మాత రాధికా కుమారస్వామి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ అందిస్తున్న ఈ సినిమాకు డా.సూరి […]
మార్వెల్ స్టూడియోస్ ప్రాంఛైజీలలో అందరినీ అలరిస్తున్న సూపర్ హీరో ‘థోర్’ నాలుగో భాగం జులైలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘థోర్: లవ్ అండ్ థండర్’ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మార్వెల్ సంస్థ విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘థోర్’ నాలుగో భాగం జులై 8న ప్రపంచవ్యాప్తంగా విడుల కానుంది. ‘థోర్’ టైటిల్ పాత్రధారి క్రిస్ హేమ్స్‌వర్త్ కొత్త ప్రయాణానికి బయలుదేరటంతో ఆరంభం అవుతుంది. దేవుళ్లందరినీ అంతమొందించాలనుకునే గోర్ లక్ష్యానికి థోర్ అడ్డుపడతాడు. […]
నటుడు విజయ్ చందర్ పేరు వినగానే చప్పున ఈ నాటికీ ‘కరుణామయుడు’ విజయ్ చందర్ అంటూ జనం గుర్తు చేసుకుంటారు. ఏసుప్రభువు జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘కరుణామయుడు’ చిత్రాన్ని నిర్మించి, ఏసు పాత్రలో నటించి, అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ చందర్. అప్పటి నుంచీ జనం మదిలో ఆయన ‘కరుణామయుడు’ విజయ్ చందర్ గానే నిలచిపోయారు. తెలుగునాట యన్టీఆర్ తరువాత కొన్ని అరుదైన పురాణ,చారిత్రక పాత్రల్లో మేటి అనిపించుకున్న ఘనుడు విజయ్ చందర్. తెలుగుతెరపై ఏసుక్రీస్తు […]
పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను చేయబోయే ప్రాజెక్ట్‌లు ఏమిటో ఎనౌన్స్ చేశాడు. ముందుగా దర్శకుడు కొరటాల శివ సినిమాను ఎన్టీఆర్ 30 పేరుతో పాన్ ఇండియా సినిమాగా ప్రకటించాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతాడు. దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. వీటితో పాటు ఎంతో కాలాంగా బుచ్చిబాబుతో సినిమా చేస్తాడని వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]
‘బిగ్ బాస్’ తెలుగునాట అందరినీ ఆకట్టుకున్న రియాలిటీ షో. అయితే ఇప్పటి వరకూ ఈ షో లో విజేతలుగా నిలిచిన వారికి ఎవరికీ స్టార్ డమ్ దక్కలేదు. అంతే కాదు ప్రజలలో గుర్తింపు వచ్చినా చిత్ర పరిశ్రమలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరులో సాగుతూ వచ్చింది. దీనికి ఈ షోలో పాల్గొని విజేతలుగా, రన్నరప్‌లుగా నిలిచిన వారే నిదర్శనం. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన హాటీలు ఎన్ని విధాలుగా ఎంత ప్రయత్నించినా […]
ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘లవ్వాట’. ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ‘రావణలంక’ ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరో. మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రంలో బెనర్జీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. జూన్ 22 నుంచి, శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ జరిగింది. సోషల్ మీడియాలో నిర్వహించిన కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన […]
ఇటీవల ‘సర్కారువారి పాట’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ టీజర్‌ను మే 31 న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటానికి దర్శకుడు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్‌కు అచ్చివచ్చిన ‘అ’ సెంటిమెంట్‌ను ఈ సినిమాకు అనుసరించి ఈ మూవీకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘ఒక్కడు, దూకుడు’లో […]
‘అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్ ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు. అలా పలు ప్రశంసలు అందుకుంటూనే చంద్రమోహన్ తనదైన అభినయంతో జనాన్ని పరవశింపచేశారు. కొన్ని చిత్రాలలో కథానాయకునిగానూ అలరించారు. అనేక సినిమాలలో అభినయ ప్రాధాన్యమున్న పాత్రల్లో మురిపించారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. 1945 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో ఆయన జన్మించారు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే […]
ఏ రంగంలోనైనా ప్రఖ్యాతి గాంచిన వారివద్ద పనిచేసి, వారికి తగిన శిష్యులు అనిపించుకోవడం అంత సులువు కాదు. తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే – ‘గురువు గారు’ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావే! ఆయన శిష్యప్రశిష్యులు తెలుగు చిత్రసీమలో రాణిస్తున్నారు. అదే తీరున ఆయన సమకాలికులైన కె.రాఘవేంద్రరావు శిష్యగణం కూడా తెలుగు సినిమా రంగంలో అలరిస్తూనే ఉన్నారు. రాఘవేంద్రుని శిష్యుల్లో ఎందరో జైత్రయాత్రలు చేశారు. గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. వారిలో […]
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జన్మదినం మే23. నేటితో ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు ఓ లేఖ రాశారు. ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే.. దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది.అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్‌పై తొలిసారి క్లాప్‌కొట్టటంతోనా కెరీర్ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు […]