ఇటీవల ‘సర్కారువారి పాట’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ టీజర్‌ను మే 31 న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటానికి దర్శకుడు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్‌కు అచ్చివచ్చిన ‘అ’ సెంటిమెంట్‌ను ఈ సినిమాకు అనుసరించి ఈ మూవీకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘ఒక్కడు, దూకుడు’లో తన పాత్ర పేరు ‘ఎ’ అక్షరంతో మొదలైనప్పటికీ మహేష్ సినిమాలు ‘అర్జున్, అతిథి, ఆగడు’ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
Sarkaru Vaari Paata: ప్రాఫిట్ జోన్‌లోకి ఎంట్రీ.. డబుల్ సెంచరీకి చేరువలో!
అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన ‘అతడు’ థియేట్రికల్‌గా ఫర్వాలేదనిపించింది. టీవీల్లో మాత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ’ అక్షరంతో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది, అ..ఆ, అరవింద సమేత, అల వైకుంఠపురములో’ సినిమాలు ఘన విజయం సాధించగా… ఒక్క ‘అజ్ఞాతవాసి’ మాత్రం నిరాశపరిచింది. ఇప్పుడు మహేష్ సినిమాకు ‘అర్జునుడు’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వినిపిస్తోంది. అదే నిజం అయితే మహేష్‌కు కలసి రాని… త్రివిక్రమ్‌కు అచ్చివచ్చిన ‘అ’ సెంటిమెంట్ వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘అర్జునుడు’కి ఎలా పని చేస్తుందన్న విషయం ఆసక్తి కరంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ‘అ’ సెంటిమెంట్ ఎలాంటి రిజల్ట్ అందిస్తుంది? మహేష్ ‘అర్జునుడు’గా ఏ స్థాయిలో మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.