K. Raghavendra Rao : నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జన్మదినం మే23. నేటితో ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.
ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు ఓ లేఖ రాశారు. ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే.. దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!

అది 1963వ సంవత్సరం ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది.అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్‌పై తొలిసారి క్లాప్‌కొట్టటంతోనా కెరీర్ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు నాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు.
10 ఏళ్లపాటు అసిస్టెం్‌గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.యస్ ప్రకాశ్‌రావుగారు అందించిన ‘బాబు’ (1975) చిత్రంతో దర్శకునిగా సినిమా ప్రయాణం. ఆ రోజు నుండి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, ఎత్తులు, లోతులుఅవార్డులు, రివార్డులు ఎన్నిచూసుంటాను. 48 ఏళ్ల దర్శకత్వ సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి.

అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో ‘‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’’అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను. ఆ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లతో పాటు , రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను.అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతున్నాను.
నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి‘‘అబద్దాలు రాయటం అనర్ధం, నిజాలు రాయటానికి భయం, …అంటూ మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు,విప్పి చెప్పలేదు, కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం…..’’ అంటూ తన బుక్ గురించి
చెప్పుకొచ్చారు దర్శక దిగ్గజం దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు. చివరగా నేను చెప్పేదొక్కటే ‘సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదు,ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా…
కె.రాఘవేంద్రరావు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!