మార్వెల్ స్టూడియోస్ ప్రాంఛైజీలలో అందరినీ అలరిస్తున్న సూపర్ హీరో ‘థోర్’ నాలుగో భాగం జులైలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘థోర్: లవ్ అండ్ థండర్’ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మార్వెల్ సంస్థ విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘థోర్’ నాలుగో భాగం జులై 8న ప్రపంచవ్యాప్తంగా విడుల కానుంది. ‘థోర్’ టైటిల్ పాత్రధారి క్రిస్ హేమ్స్‌వర్త్ కొత్త ప్రయాణానికి బయలుదేరటంతో ఆరంభం అవుతుంది. దేవుళ్లందరినీ అంతమొందించాలనుకునే గోర్ లక్ష్యానికి థోర్ అడ్డుపడతాడు. చివరికి ఏం జరిగిందన్నదే ఈ చిత్రం కథాంశం. విడుదలైన ట్రైలర్ హై ఓల్టేజ్ విజువల్ వండర్ లా అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా లావిష్‌గా ఉంది. టైకా వెయిటిటి రచించి, దర్శకత్వం వహించిన ‘థోర్: లవ్ అండ్ థండర్’ లో థోర్ గా క్రిస్ హేమవర్త్, గోర్ గా క్రిష్టియన్ బాలే, వాల్ కైరీగా తెస్సా థాంప్సన్, జీయుస్ గా రస్సెల్ క్రోవ్ నటించిన ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా వాల్ట్ డిస్నీ పంపిణీ చేస్తోంది.