Vijay Chander : చిత్ర విచిత్రం… విజయ్ చందర్ నటజీవితం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు విజయ్ చందర్ పేరు వినగానే చప్పున ఈ నాటికీ ‘కరుణామయుడు’ విజయ్ చందర్ అంటూ జనం గుర్తు చేసుకుంటారు. ఏసుప్రభువు జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘కరుణామయుడు’ చిత్రాన్ని నిర్మించి, ఏసు పాత్రలో నటించి, అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ చందర్. అప్పటి నుంచీ జనం మదిలో ఆయన ‘కరుణామయుడు’ విజయ్ చందర్ గానే నిలచిపోయారు. తెలుగునాట యన్టీఆర్ తరువాత కొన్ని అరుదైన పురాణ,చారిత్రక పాత్రల్లో మేటి అనిపించుకున్న ఘనుడు విజయ్ చందర్. తెలుగుతెరపై ఏసుక్రీస్తు జీవితాన్ని తొలిసారి ఆవిష్కరించిన ఘనత సైతం విజయ్ చందర్ సొంతం. ఆ తరువాత కూడా “రాజాధిరాజు, దయామయుడు” వంటి చిత్రాలలోనూ ఏసుక్రీస్తు పాత్రల్లో మెప్పించారు విజయ్ చందర్.
తెలిదేవర విజయచందర్ 1939 మే 24న జన్మించారు. ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులుకు మనవడు అవుతారు విజయ్ చందర్. ప్రకాశం పంతులు జీవితగాథతో ‘ఆంధ్రకేసరి’ తెరకెక్కించి అలరించారు చందర్. ఇక ‘షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’లో షిరిడీ సాయిబాబా పాత్ర పోషించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ‘వేమన చరిత్ర’లో వేమనగానూ మురిపించారు. ‘పిలిస్తే పలుకుతా’ వంటి సాంఘిక చిత్రంలోనూ సాయిబాబాగా నటించారు. ఏసుక్రీస్తు పాత్ర పోషణతో విజయ్ చందర్ కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అయితే మామూలు సినిమాల్లో మాత్రం ఆయన అంతగా అలరించలేకపోయారు. ఏయన్నార్, ఆదుర్తి సుబ్బారావు కలసి నిర్మించిన “సుడిగుండాలు” ద్వారా చిత్రసీమలో ప్రవేశించారు విజయ్ చందర్. తరువాత కొన్ని చిత్రాలలో మంచి పాత్రలే లభించాయి. ‘సి.ఐ.డి.రాజు’లో హీరోగానూ నటించారు. అవేవీ, ఆయన కోరుకున్న స్టార్ డమ్ ను సంపాదించి పెట్టలేదు. ఆ సమయంలోనే బైబిల్ ఆధారంగా ఏసుక్రీస్తు గాథను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఎందరో నిరుత్సాహ పరచినా, విజయ్ చందర్ ముందుకే సాగారు. పలు ప్రయాసలకు ఓర్చి ‘కరుణామయుడు’ చిత్రాన్ని పూర్తి చేశారు. ఏ.భీమ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ‘కరుణామయుడు’ విడుదలై విజయఢంకా మోగించింది. విజయ్ చందర్ నటజీవితంలో మళ్ళీ ఆ స్థాయి విజయం లభించలేదు. విజయ్ చందర్ తెరకెక్కించిన ‘దయాసాగర్’ బుల్లితెర సీరియల్ విశేషాదరణ చూరగొంది. పలు భాషల్లోకి అనువాదం అయింది.
Also Read
- Amala Akkineni: అక్కినేని కోడళ్లపై అమల ఆసక్తికర వ్యాఖ్యలు! అఖిల్ భార్యపై స్పెషల్ కామెంట్స్..
- Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
- Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను 'హీరోయిన్' అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
- Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతగానో అభిమానించే విజయ్ చందర్, అప్పట్లో యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీకి వ్యతిరేకంగానూ ప్రచారం చేశారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటే విజయ్ చందర్ కు ఎంతో గౌరవం. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి కాగానే విజయ్ చందర్ ను ఎఫ్.డి.సి అధ్యక్షునిగాచేశారు. సినిమాల్లో యన్టీఆర్ ను గౌరవించే విజయ్ చందర్, రాజకీయాల్లో మాత్రం వ్యతిరేకించేవారు. కానీ, యన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘యన్టీఆర్ – కథానాయకుడు’లో విజయ్ చందర్ నటించడం విశేషం. కూకట్ పల్లిలో తన సొంత స్థలాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో వృద్ధకళాకారుల కోసం ఇచ్చారు విజయ్ చందర్. మే 24తో 83 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విజయ్ చందర్ మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
ట్రెండింగ్
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!