పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను చేయబోయే ప్రాజెక్ట్‌లు ఏమిటో ఎనౌన్స్ చేశాడు. ముందుగా దర్శకుడు కొరటాల శివ సినిమాను ఎన్టీఆర్ 30 పేరుతో పాన్ ఇండియా సినిమాగా ప్రకటించాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతాడు. దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. వీటితో పాటు ఎంతో కాలాంగా బుచ్చిబాబుతో సినిమా చేస్తాడని వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదు. తొలి సినిమా ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ హిట్ కొట్టిన బుచ్చిబాబు ఆ తర్వాత ఎవరి సినిమా చేస్తున్నాడనేది తెలియచేయలేదు. నిజానికి బుచ్చిబాబు జూనియర్ కోసం పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా సిద్దం చేశాడని, ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఈ సినిమానే మొదలవుతుందని వినిపించింది.
‘ఉప్పెన’ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన బుచ్చిబాబుకు తప్పకుండా ఎన్టీఆర్ సినిమా చేస్తాడనే అనుకున్నారు. అయితే మారిన సమీకరణాల ప్రకారం పాన్ ఇండియా రేంజ్‌లో ఉండే సినిమాలపైనే ఎన్టీఆర్ దృష్టి పెట్టాడని.. ఆ మేరకే బుచ్చిబాబు సినిమా వెనక్కి వెళ్ళిందనే టాక్ వినిపిస్తోంది. తన మార్కెట్ విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అదే నిజం అయితే బుచ్చిబాబు వచ్చే ఏడాది వరక వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే హర్ట్ అయిన బుచ్చిబాబు అప్పటి వరకూ వేచి చూస్తాడా? లేదా అందుబాటులో ఉన్న హీరోతో ముందుకు సాగుతాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.