ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం 15 లక్షల ఇళ్లులు పేదలకు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నాం అని ఏపీ సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ‘హౌస్ ఫర్ ఆల్’ కాన్సెప్ట్‌తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని, 5 లక్షల ఇళ్లులు ఉగాదికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లులు మంజూరు అయితే.. కనీసం 4 లక్షల ఇళ్లులు కూడా కట్టలేదని గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి […]
భారత్, శ్రీలంక వేదికగా పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు విడుదల కానుంది. సాయంత్రం 6:30కు ఐసీసీ షెడ్యూల్‌ను రిలీజ్ చేయనుంది. షెడ్యూల్‌పై అందరూ ఆసక్తిగా ఉన్నారు. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ షెడ్యూల్ ఎలా ఉండనుందో నేడు తేలనుంది. స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3 ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. జియో హాట్‌స్టార్ […]
టీమిండియా స్టార్ ఓపెనర్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌ల వివాహం వాయిదా పడింది. ఈ విషయాన్ని పలాశ్ సోదరి పలాక్ ముచ్చల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేశారు. వివాహం విషయంలో ఇరు కుటుంబాల గోప్యతను ప్రతిఒక్కరు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ‘స్మృతి మంధాన నాన్న గారికి అనారోగ్యం కారణంగా.. పలాశ్ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సున్నితమైన విషయంలో అందరూ మా కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నా’ పలాక్ పేర్కొన్నారు. […]
ఇటీవలే ‘మొంథా’ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీని అతలాకుతలం చేసింది. మొంథా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట అంతా నీట మునిగింది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు మరో అశుభవార్త. అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది. రేపటికి తుఫాన్‌గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుఫాన్‌గా మారాక సెన్యార్గా నామకరణం చేయాలని ఐఎండీ భావిస్తోంది. Also Read: YS Jagan: కడప జిల్లాలో మూడు […]
ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజులు ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బెంగుళూరు నుంచి నేరుగా పులివెందులకు జగన్ చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. Also Read: IND vs SA: పసలేని బ్యాటింగ్.. వైట్‌వాష్ దిశగా […]
స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్‌లో బెబ్బులిలా చెలరేగే భారత్.. దక్షిణాఫ్రికాకు సిరీస్‌ను కోల్పోవడం ఇక లాంఛనమే. మొదటి టెస్టులో దారుణ ఓటమిని చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ప్రొటీస్ టీమ్ 489 రన్స్ చేయగా.. భారత్ 201 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 26 రన్స్ చేయగా.. 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. టీమిండియాకు 400 రన్స్ లక్ష్యంను విధించే అవకాశం ఉంది. […]
ప్రస్తుత రోజుల్లో చిన్న స్మార్ట్‌ఫోన్ దిరికితేనే.. జేబులో వేసుకుని పోతున్నారు జనాలు. కాస్త కాస్ట్లీ ఫోన్ దొరికితే ఊరుకుంటారా?.. గుట్టుచప్పుడు కాకుండా సైడ్ చేస్తారు. అందులోనూ ఐఫోన్ దొరికే.. మూడో కంటికి కూడా తెలియకుండా ఇంటికి తీసుకెళుతారు. అయితే అందరూ ఇలా ఉండరు. నూటికో, కోటికో ఒక్కరు మనసున్న మహారాజు కూడా ఉంటాడు. అందులో ఒకడే ఆంధ్రకు చెందిన ఆటో డ్రైవర్ స్వామి. తనకు కాస్ట్లీ ఐఫోన్ దొరికితే తిరిగిచ్చేశాడు. ప్రస్తుతం స్వామి పేరు సోషల్ మీడియాలో […]
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐకూ’ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఐకూ 15 ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందే కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ ప్రీ-బుకింగ్‌లకు అద్భుతమైన స్పందన దక్కిందని కంపెనీ చెబుతోంది. ఐకూ 15 అత్యధికంగా శోధించబడిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిందని పేర్కొంది. అయితే ఎన్ని ప్రీ-ఆర్డర్లు వచ్చాయో మాత్రం ఐకూ వెల్లడించలేదు. ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రీ-బుకింగ్ […]
పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి కోర్టు ఐదు రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రోజుల విచారణ ముగియగా కీలక విషయాలు పోలీసులు రాబట్టారు. నేడు మూడో విచారణ కూడా ముగిసింది. అయితే మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని స్వయంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ విచారిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో రవిని సజ్జనార్ విచారిస్తున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు స్వయంగా సీపీనే రంగంలోకి దిగారు. మూడో విచారణ అనంతరం […]
గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసింది. ముత్తుస్వామి (25), కైల్ వెరినె (1) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్ పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి రోజు […]