చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐకూ’ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఐకూ 15 ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందే కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ ప్రీ-బుకింగ్‌లకు అద్భుతమైన స్పందన దక్కిందని కంపెనీ చెబుతోంది. ఐకూ 15 అత్యధికంగా శోధించబడిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిందని పేర్కొంది. అయితే ఎన్ని ప్రీ-ఆర్డర్లు వచ్చాయో మాత్రం ఐకూ వెల్లడించలేదు.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రీ-బుకింగ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ iQOO TWS 1e ఇయర్‌బడ్‌ని ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ఫోన్‌పై ఏడాది అదనపు వారంటీని కూడా ఇస్తోంది. ప్రీ-ఆర్డర్ చేసిన వారికి కంపెనీ ఐకూ 15 ఫోన్‌ను ముందుగానే డెలివరీ చేస్తుంది. ఈ ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ధర రూ.65,000 నుంచి రూ.70,000 మధ్య ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ విభాగంలోని ఇతర ఫోన్‌ల ధర రూ.70,000 కంటే ఎక్కువగా ఉంది. అంటే OnePlus 15, Realme GT 8 Pro కంటే తక్కువ ధరకు iQOO 15ను కంపెనీ లాంచ్ చేస్తుంది.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ అయింది. అవే స్పెసిఫికేషన్లతో భారత్ వేరియెంట్ కూడా లాంచ్ అవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.85-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16తో వస్తుండగా.. ఐదు అప్‌డేట్‌లను కంపెనీ అందించనుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ హ్యాండ్‌సెట్ 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీతో రానుంది.
