Sankranti Effect : ఆంధ్రులు అత్యంత ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే లక్షలాది మంది ప్రయాణికులకు రైల్వే రిజర్వేషన్లు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పండుగకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లన్నీ దాదాపు రెండు నెలల ముందే పూర్తిగా బుక్ అయిపోయాయి. ప్రస్తుతం ఏ రైలు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా భారీ వెయిటింగ్ లిస్ట్ తప్ప వేరేమీ కనిపించడం లేదు. కొన్ని రైళ్లకైతే వెయిటింగ్ లిస్ట్ కూడా దాటిపోయి ‘రిగ్గ్రెట్’ (అందుబాటులో లేవు) అనే స్థితి కనిపిస్తోంది. ఉద్యోగాల హడావిడిలో ముందుగా రిజర్వేషన్ చేసుకోని వారికి, ముఖ్యంగా విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లాల్సిన వారికి ఒక్క బెర్త్ కూడా ఖాళీ లేకపోవడంతో టికెట్ కౌంటర్ల వద్ద, ఆన్‌లైన్‌లో ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. రెగ్యులర్ రైళ్లతో పాటు స్పెషల్ ట్రైన్స్‌లోనూ సీట్లన్నీ నిండిపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
IND vs SA: టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్.. మరి బుమ్రా సంగతేంటి?
విశాఖపట్నం, ఇతర ప్రాంతాలకు రైలులో కనీసం 12 గంటల సుదూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంత దూరం బస్సుల్లో ప్రయాణించాలంటే అనేక బస్సులు మారాల్సి వస్తుంది కాబట్టి చాలా మంది రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతారు. అయితే, ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రిజర్వేషన్లు రెండు మూడు నెలల ముందు నుంచే నిండిపోతుంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం కావడంతో, పండుగకు సొంత ఊరు వెళ్లాలనుకునే వారందరూ ఇప్పుడు రైళ్లకు ప్రత్యామ్నాయంగా బస్సులను లేదా ఇతర ప్రయాణ మార్గాలను వెతుక్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
సూపర్ లుక్, బెస్ట్ మైలేజ్, తక్కువ బడ్జెట్.. కొంటే TVS Apache RTR 160నే కొనాలి!