ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. 10 ఫ్రాంచైజీలలో 77 స్లాట్‌ల కోసం వేలం జరగనుంది. ఈ వేలం కోసం 10 ఫ్రాంచైజీలు రూ.237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పటివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వద్ద అత్యధిక పర్స్ వాల్యూ (రూ.64.3 కోట్లు) ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా భారీ బడ్జెట్‌ను (రూ.43.4 కోట్లు) కలిగి ఉంది. ఈ రెండు జట్లకు మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక వచ్చే సీజన్ మార్చి 2026 చివరిలో ప్రారంభం కానుంది.
వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. వెంకటేష్ అయ్యర్, లియామ్ లివింగ్‌స్టోన్, రవి బిష్ణోయ్ వంటి ప్లేయర్స్ కూడా ఫ్రాంచైజీల దృష్టిలో ఉన్నాయి. సీనియర్, యువ ప్రతిభావంతులను జట్టులోకి తీసుకోవడంపై కేకేఆర్, సీఎస్‌కే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దాంతో కేకేఆర్, సీఎస్కే మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. ఈ వేలంలో యువ ఆటగాళ్లకు (ఆకిబ్ నబీ, అశోక్ శర్మ, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్) మంచి డిమాండ్ ఉంది. వేలం నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Also Read: IPL 2026 Auction: ఫ్రాంచైజీల టాప్ పిక్స్ వీరే.. ఈ అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్లపై కాసుల వర్షమే!
లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్:
# ఐపీఎల్ 2026 వేలం ఎప్పుడు?:
ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ 16 జరుగుతుంది
# ఐపీఎల్ 2026 వేలం ఎక్కడ?:
వేలం యూఏఈలోని అబుదాబిలో జరుగుతుంది
# ఐపీఎల్ 2026 వేలం ప్రారంభం ఎప్పుడు?:
వేలం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది
# ఐపీఎల్ 2026 వేలం ఎక్కడ చూడాలి?:
ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది
# ఐపీఎల్ 2026 వేలం లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడవచ్చు?:
JioHotstar యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు