టీమిండియా నయా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 300 సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మూడు సిక్సర్లు కొట్టడంతో.. అభిషేక్ ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. 163 ఇన్నింగ్స్‌లలో ట్రిపుల్ సెంచరీ సిక్సర్ల రికార్డును అభిషేక్ చేరుకున్నాడు. ఇదివరకు ఈ రికార్డు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 205వ టీ20 ఇన్నింగ్స్‌లో 300వ సిక్సర్‌ను కొట్టాడు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ 251 మ్యాచ్‌లో 300వ సిక్సర్‌ను కొట్టి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.
అభిషేక్ శర్మ మరో రికార్డును కూడా తన పేరుపై లిఖించుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మూడుసార్లు సిక్స్ కొట్టిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో అభిషేక్ మొదటి బంతికి సిక్స్ కొట్టాడు. లుంగీ ఎన్గిడి బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం ద్వారా తన ఖాతాతో ఈ రికార్డు చేరింది. టీ20లో అభిషేక్ బాదిన 300 సిక్సర్‌లలో ఈ ఏడాదిలోనే 107 సిక్సర్లు కొట్టాడు. టీ20లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకు 463 టీ20 మ్యాచ్‌లలో 547 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (414 మ్యాచ్‌ల్లో 435 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (345 మ్యాచ్‌ల్లో 395 సిక్సర్లు), సంజు శాంసన్ (319 మ్యాచ్‌ల్లో 368 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (405 మ్యాచ్‌ల్లో 350 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (239 మ్యాచ్‌ల్లో 332 సిక్సర్లు), సురేష్ రైనా (336 మ్యాచ్‌ల్లో 325 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (313 మ్యాచ్‌ల్లో 308 సిక్సర్లు) ఉన్నారు.
Also Read: సూపర్ లుక్, బెస్ట్ మైలేజ్, తక్కువ బడ్జెట్.. కొంటే TVS Apache RTR 160నే కొనాలి!
2025లో ఇప్పటివరకు అభిషేక్ శర్మ 40 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 1568 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగే మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో 47 పరుగులు చేస్తే.. ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక భారత క్రికెటర్ అత్యధిక టీ20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొడతాడు. చూడాలి మరి అభిషేక్ ఈ రికార్డును సాధిస్తాడో లేదో చూడాలి. అభిషేక్ తన అరంగేట్రం నుంచే సంచలనాలు సృష్టిస్తున్నాడు. సునామి ఇన్నింగ్స్‌లతో రికార్డును బద్దలు కొడుతున్నాడు. సింగిల్స్, డబుల్స్ తీసినంత ఈజీగా.. అతని బ్యాట్ నుంచి సిక్సర్లు వస్తున్నాయి. అభిషేక్ ఆటపై అతడి గురువు యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపిస్తున్నాడు.