ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం 15 లక్షల ఇళ్లులు పేదలకు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నాం అని ఏపీ సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ‘హౌస్ ఫర్ ఆల్’ కాన్సెప్ట్‌తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని, 5 లక్షల ఇళ్లులు ఉగాదికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లులు మంజూరు అయితే.. కనీసం 4 లక్షల ఇళ్లులు కూడా కట్టలేదని గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తాం అని పార్థసారథి తెలిపారు. ఈరోజు ఉదయం ఏపీ సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
Also Read: T20 World Cup 2026 Schedule: నేడే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్.. భారత్‌లోని 5 వేదికల్లో మ్యాచ్‌లు!
‘వ్యవసాయ, పారిశ్రామిక రంగాన్ని సమ దృష్టితో చూస్తూ మా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తిని నిరంతరం పర్యవేక్షిస్తూన్నాం. రైతుల సమస్యలు, ప్రజల సమస్యలను తెలుసుకుని ఆర్టీజీఎస్ నుంచే పరిష్కారంపై దృష్టి పెడుతున్నాం. హౌసింగ్ అన్నిటికన్నా ముఖ్యమైనది. 16 నెలల్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వైసీపీ మేమే ఇళ్లులు కట్టాం అని చెప్పుకుంటోంది. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లులు మంజూరు అయితే కనీసం 4 లక్షల ఇళ్లులు కూడా కట్టలేదు. హౌస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్‌తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. 5 లక్షల ఇళ్లులు ఉగాదికి పంపిణీ చేస్తాము. ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం 15 లక్షల ఇళ్లులు పేదలకు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నాం. 5 లక్షలు పీఎంఈవై కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.