గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసింది. ముత్తుస్వామి (25), కైల్ వెరినె (1) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్స్ పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి రోజు సఫారీలే ఆధిపత్యం చెలాయించారు. ఇప్పటికే 247 రన్స్ చేసిన దక్షిణాఫ్రికా మంచి స్కోరు దిశగా సాగుతోంది.
రెండో టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బుమ్రా బౌలింగ్‌లో ఐదెన్ మార్‌క్రమ్ (38)కు లైఫ్ లభించింది. పరుగుల ఖాతా తెరవకముందే ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో కేఎల్ రాహుల్ పట్టుకోలేకపోయాడు. ఆపై రికెల్‌టన్ (35), మార్‌క్రమ్ జోడీ నిలకడగా ఆడి తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. టీ బ్రేక్‌కు ముందు అద్భుతమైన యార్కర్‌కు మార్‌క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో సెషన్ ఆరంభంలోనే రికెల్‌టన్ను కుల్దీప్ అవుట్ చేశాడు. ఈ సమయంలో ట్రిస్టన్ స్టబ్స్ (49), తెంబా బావుమా (41) నిలకడగా ఆడి రెండో సెషన్‌లో మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 156/2తో నిలిచింది.
Also Read: NTR-Neel: మళ్లీ మారిన డ్రాగన్?.. ఈసారి ఊర మాస్ కటౌట్!
లంచ్ బ్రేక్ తర్వాత జడేజా బౌలింగ్‌లో తెంబా బావుమా పెవిలియన్ చేరాడు. దాంతో మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే స్టబ్స్, వియాన్ ముల్డర్ (13)ని కుల్దీప్ అవుట్ చేశాడు. మరికాసేపట్లో మొదటి రోజు ఆట ముగుస్తుందనగా టోనీ డి జోర్జి (28)ని సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ముత్తుస్వామి, కైల్ వెరినె మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. మొదటి రోజులో దక్షిణాఫ్రికా మంచి స్కోరు చేసింది. రెండో రోజులో అయినా భారత బౌలర్లు వికెట్స్ తీయకుంటే.. భారీ స్కోర్ ఖాయం.