బెంగళూరు టెక్ సమ్మిట్ 2025లో ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ సానియా మీర్జా అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ.. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు రిచా ఘోష్‌కు సలహాలు ఇచ్చారు. సోషల్ మీడియాను అస్సలు పట్టించుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలని, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని చెప్పారు. మొదట్లో మహిళల క్రికెట్‌కు అంత ఆదరణ ఉండేది కాదని, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు కాదని.. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా […]
బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ముగ్గురు నటీమణులను ఈరోజు విచారిస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. జీత్ విన్ అనే బెట్టింగ్ సైట్‌ను నిధి ప్రమోట్ చేశారు. సీఐడీ అధికారులు నిధిని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రంమలోనే నిధి అగర్వాల్ […]
కర్నూలు జిల్లా ఆలూరు పీఎస్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మందుబాబు పోలీసు జీపును దర్జాగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలూరులో బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పెద్దహోతూరు యువరాజు పట్టుబడ్డాడు. తన బైక్ ఇవ్వాలని, ఇంటికి వెళ్లి వస్తానని పోలీసులతో చెప్పాడు. బైక్ ఇవ్వకపోవడంతో వేరే బైక్ తీసుకుని వెళ్లాడు. ఇవాళ ఉదయం మళ్లీ బైక్ తీసుకువచ్చాడు. తన బైక్ ఇస్తే వెళ్లిపోతానని, లేకుంటే పోలీస్ […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఎక్కడ తేడా కొట్టినట్టు పార్టీ పోస్ట్‌మార్టంలో తేలింది? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లోకల్ నాయకులు ఏమని రిపోర్ట్ ఇచ్చారు? వాళ్ళు బాగా హర్ట్ అయ్యారన్నది నిజమేనా? అసలు స్థానిక నేతల ఆవేదన ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్… సీరియస్ పోస్ట్‌మార్టంలో పడిందట. అసలు గెలుస్తామని, లేదంటే గట్టి పోటీ ఇవ్వగలుగుతామని భావించిన భావించిన పార్టీ పెద్దలు… కాంగ్రెస్ అభ్యర్థికి అంత మెజార్టీ రావడాన్ని అస్సలు […]
గవర్నమెంట్ రూల్స్ గీల్స్ జాన్తానై….. నా నియోజకవర్గంలో నేను చెప్పిందే వేదం. నేను రాసిన రాజ్యాంగమే నడవాలని ఆ ఎమ్మెల్యే అంటున్నారా? అది కాదు సార్….. కాస్త వినండని వ్యాపారులు చెప్పబోయినా, మాటల్లేవ్… మాట్లాడుకోవడాల్లేవ్…. నా మాటే శాసనం అని అంటున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఏ విషయంలో అంత కఠినంగా ఉన్నారు?. మునుగోడు మందుగోల అంతకంతకూ పెరుగుతూ యమా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇందులో తగ్గేదెవరు? నెగ్గేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో కొత్త కొత్త మలుపులు కూడా ఉండబోతున్నాయన్న […]
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎల్లుండి (నవంబర్ 22) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. సోమవారం (నవంబర్ 24) నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణిస్తూ.. నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందందని పేర్కొంది. Also Read: Ambati Rambabu: […]
‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా.. […]
పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర అత్యంత కీలకం అని నారా భువనేశ్వరి అన్నారు. చిన్నతనంలోనే విలువలు, సంస్కారం పిల్లలకు నేర్పాలని చెప్పారు. పిల్లల ఆసక్తిని గుర్తించి.. ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేష్ ప్రజాసేవలో బిజీగా ఉండటంతో.. దేవాన్ష్ చదువు, క్రీడలను బ్రాహ్మణి చూసుకుంటోందన్నారు. గతంలో రాజకీయాల్లో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు కారణంగా లోకేష్ పెంపకం బాధ్యత తాను తీసుకున్నాను అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. కుప్పం సామగుట్లపల్లి మండల పరిషత్ […]
హనుమంతుడుపై టాలీవుడ్ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే.. కచ్చితంగా ఆయన సినిమాలు ఆపేస్తాం అంటూ విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. తండ్రి మనోభావాలను సైతం కించపరుస్తూ మాట్లాడారని విశ్వహిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా? అని ప్రశ్నించారు. హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని రాజమౌళిని రవికుమార్ హెచ్చరించారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్ర వేదనకు […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఫైర్ అయ్యారు. రాజమౌళి సినిమాలు చూసి హిందూ దేవుళ్లపై గౌరవం ఉందనుకున్నాం అని, ఆయన కామెంట్లపై హిందువులు ఇప్పుడు రగిలిపోతున్నారన్నారు. ఆంజనేయుడిపై నమ్మకం లేదనడం హిందువుల మనోభవాలు దెబ్బతీయడమే అని ధ్వజమెత్తారు. అంత పేరు, అంత డబ్బు, ప్రతిష్ట హిందూ దేవుళ్లను ఉపయోగించుకుని తెచ్చుకుంటారని విమర్శించారు. హిందూ దేవుళ్లని, సనాతన ధర్మాన్ని అవమానించే హక్కు ఎవరిచ్చారు?.. […]