Motorola Edge 70: స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ( Motorola Edge 70)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెళ్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. పాంటోన్ బ్రాండింగ్‌తో మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను తీసుకువచ్చింది మోటరోలా. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, ఆధునిక AI ఫీచర్లు, మెరుగైన కెమెరాలతో Motorola Edge 70 మిడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో గట్టి పోటీదారుగా నిలవనుంది.
ఈ కొత్త Motorola Edge 70లో 6.7 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, Dolby Vision, HDR10+ సపోర్ట్‌ను అందిస్తుంది. స్క్రీన్‌కు Gorilla Glass 7i రక్షణ ఉంది. అలాగే ఫోన్‌కు IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, ఇంకా MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ లభించడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 8GB LPDDR5x RAM, 256GB UFS 3.1 స్టోరేజ్తో జత చేయబడింది.
రూ. 17.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra టాప్ వేరియంట్ల ధరలు వెల్లడి..!
ఫోన్ Android 16 ఆధారిత Hello UIపై పనిచేస్తుంది. మోటరోలా మూడు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను హామీ ఇస్తోంది. అలాగే మోటో AI ఫీచర్లు Next Move, Catch Me Up 2.0, Pay Attention 2.0, Remember This + Recall, Co-pilot వంటి టూల్స్ అందుబాటులో ఉన్నాయి. Motorola Edge 70లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (OISతో), 50MP అల్ట్రావైడ్ కెమెరా, మూడు-ఇన్-వన్ లైట్ సెన్సార్, ఫ్రంట్‌లో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4K @60fps వీడియో రికార్డింగ్ కు మద్దతిస్తుంది. AI వీడియో ఎన్హన్సమెంట్, AI యాక్షన్ Shot, AI ఫోటో ఎన్హన్సమెంట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 5,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. దీనిని ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 31 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని మోటరోలా చెబుతోంది. ఇది 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. Motorola Edge 70కు ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. ఫోన్ మందం కేవలం 5.99mm మాత్రమే కాగా, బరువు సుమారు 159 గ్రాములు. సన్నని డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీల్ ఇవ్వడం దీని ప్రత్యేకత.
Top 5 Best-Selling Cars: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే!
భారత్‌లో Motorola Edge 70 ధరను రూ. 29,999గా నిర్ణయించారు. ఇది 8GB RAM + 256GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1,000 వరకు డిస్కౌంట్ కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, మోటరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి రానుంది. పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ గాడ్జెట్ గ్రే, పాంటోన్ లిల్లీ ప్యాడ్ కలర్స్ లో మొబైల్ లభిస్తుంది.
