సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయంను చవిచూసింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి, మార్కో యాన్సన్ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో టీమిండియా టెస్ట్ […]
‘ఆట’ అన్నాక గాయాలు అవ్వడం సహజమే. క్రికెట్ కూడా అందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో గాయాల పాలు కాని ఆటగాళ్లు చాలా అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ప్లేయర్ ఎప్పుడోకప్పుడు ఇంజురీకి గురవుతాడు. అయితే టీమిండియాకు కొన్నేళ్ల నుంచి గాయాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. స్టార్ ప్లేయర్స్ నెలల తరబడి మైదానంకు దూరమవుతున్నారు. ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఇటీవలి గాయాలు చూస్తే.. ప్రస్తుత క్రికెటర్లు మరీ సున్నితంగా తయారవుతున్నారా? అనే సందేహాలు […]
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాహుల్ టీమిండియాను నడిపించనున్నాడు. మెడ నొప్పితో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ స్థానంలో రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. రాహుల్ గతంలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు ఫార్మాట్లలో సారథిగా చేశాడు. మరోసారి కెప్టెన్సీని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కేఎల్ రాహుల్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు కానీ.. […]
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (29), సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (30)ల వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో జరగాల్సిన పెళ్లి.. మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలు సోషల్ మీడియాలో ప్రకటించాయి. శ్రీనివాస్ గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో చేరారని పలాశ్, మంధాన కుటుంబాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటికోచ్చింది. మంధానని పలాశ్ మోసం […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 15’ను ఇటీవల ఇండియాలో లాంచ్ చేసింది. చైనా వేరియెంట్‌లోని ఫీచర్లనే దాదాపుగా భారత్‌లో లాంచ్ అయిన ఫోన్లో ఉన్నాయి. వన్‌ప్లస్ మరో ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమైంది. భారతదేశంలో ‘OnePlus 15R’ లాంచ్ తేదీని ప్రకటించింది. డిసెంబర్ 17న కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయిన OnePlus Ace 6T […]
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నమెంట్ 2026 ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమై.. మార్చి 8న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీలో అడుగుపెట్టనుంది. టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, […]
గత నవంబరులో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ భంగపడిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. స్పిన్ ఆడడంలో మేటి జట్టుగా పేరున్న టీమిండియా.. సొంతగడ్డపై అదే స్పిన్ ఉచ్చులో పడడం భారత క్రికెట్‌ను కుదిపేసింది. స్వదేశంలో మరోసారి ఇలాంటి పరాభవం చూడబోమని అటు మాజీలు, ఇటు ఫాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మరో వైట్‌వాష్ తప్పేలా లేదు. ఇప్పటికే కోల్‌కతా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్.. […]
భారత్‌తో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పూర్తి పట్టు సాధించింది. ప్రస్తుతం నాలుగో రోజు కొనసాగుతోండగా.. లంచ్ బ్రేక్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 508 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్ (60), వియాన్ ముల్డర్ (29) ఉన్నారు. ఈ జోడి 5వ వికెట్‌కు 71 బంతుల్లో 42 పరుగులు జత చేసింది. Also Read: Telangana Panchayat […]
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్‌కు పదిహేను రోజుల సమయం ఉంది. డిసెంబర్ 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల […]
అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డు 304 బీ.అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో.. సదరు హోంగార్డుపై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వాటిపై […]