ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం ముగిసింది. వేలంలో 77 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వేలంలో అమ్ముడైన ఆటగాళ్లలో 48 మంది భారతీయులు, 29 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 10 ప్రాంచైజీలు మొత్తం రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. సోల్డ్, అన్‌సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ ఓసారి చూద్దాం. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో భారత బ్యాటర్ పృథ్వీ షా ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. మొదటి రెండు రౌండ్లలో అమ్ముడుపోని పృథ్వీ షాను.. అతడి మాజీ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ మూడో రౌండ్లో కొనుగోలు చేసింది. కనీస ధర రూ.75 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది. మూడో రౌండ్లో అతడి పేరు రాగా.. ఢిల్లీ బిడ్ వేసింది. మరే ప్రాంచైజీ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో అతడు ఢిల్లీ సొంతమయ్యాడు. ఐపీఎల్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) 19వ సీజన్ కోసం మంగళవారం అబుదాబిలో జరిగిన మినీ వేలం ముగిసింది. మినీ వేలంలో 77 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వేలంలో అమ్ముడైన ఆటగాళ్లలో 48 మంది భారతీయులు, 29 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 10 ప్రాంచైజీలి మొత్తంగా రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్లకు అతడిని కొనుగోలు […]
ఎవరు? ఆ లీకు వీరులెవరు..? ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీల మీటింగ్ వివరాలను బయటికి చెప్పిందెవరు?.. దీని గురించి బయట ఎక్కడా చర్చ జరక్కూడదని స్వయంగా మోడీ చెప్పినా సరే.. లీక్ చేసింది ఎవరు? అనుమానపు చూపులు ఎటువైపు ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరుపై ఆరా తీశారు. ఇప్పటిదాకా […]
తెలంగాణ సీఎం రేవంత్ హస్తినలో ఏం చేస్తున్నారు?.. మూడు రోజుల నుంచి ఢిల్లీ టూర్లో ఉన్న ముచ్చట్లేంటి?.. అంతా పైకి కనిపిస్తున్నది, వినిపిస్తున్నదేనా? లేక అంతకు మించి ఇంకేదో జరుగుతోందా?.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడం కొత్తకాదు, పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రుల్ని కలవడమూ కొత్త కాదు.. మరి ఇప్పుడే ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు? లెట్స్ వాచ్. ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ హైదరాబాద్ టూర్ ముగిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిపోయారు. మ్యాచ్ […]
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ పరిధిలోని ఆలయాలకు ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేసేందుకు 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు పాలకమండలి ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుపతిలోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం సౌకర్యాల కల్పనకు రూ.48 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కోసం ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోద ముద్ర వేశామని బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు. టీటీడీ […]
లక్కంటే ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌దే అని చెప్పాలి. అబుదాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయాడు. రూ.13 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అతడిని దక్కించుకుంది. ముందు అన్‌సోల్డ్‌గా మిగిలిన లివింగ్‌స్టోన్‌కు రెండవ రౌండ్లో అదృష్టం వరించింది. అతడి కోసం లక్నో సూపర్ జెయింట్స్, ఎస్ఆర్హెచ్ పోటీపడ్డాయి. అయితే లక్నో వద్ద సరైన పర్స్ వాల్యూ లేకపోడంతో వెనకడుగు వేసింది. దాంతో లివింగ్‌స్టోన్ ఎస్ఆర్హెచ్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు మినీ వేలంలో యువ భారత ఆటగాడిని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులోకి చేర్చుకుంది. అబుదాబిలో జరుగుతున్న వేలంలో ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ తేజస్వి సింగ్ దహియాను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. తేజస్వి వేలంలో తన పేరును రూ.30 లక్షల కనీస ధరతో నమోదు చేయగా.. అతడిపై కేకేఆర్ నమ్మకం ఉంచి భారీగా వెచ్చించింది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ […]
అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్ భారీ విజయం అందుకుంది. దుబాయ్ వేదికగా మంగళవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ దీపేశ్ దేవేంద్రన్ (5/22) మలేషియా పతనాన్ని శాసించాడు. 409 పరుగుల లక్ష్య ఛేదనలో మలేషియా 93 పరుగులకే ఆలౌట్ అయింది. మలేషియా జట్టులో హంజా పంగి (35) టాప్ స్కోరర్. డీయాజ్ పాత్రో (13), ముహద్ అఫినిద్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నారు. […]
‘టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అనే సామెత ఉంది. టాలెంట్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చినప్పుడే విజయం సాధిస్తారు అని పెద్దలు అంటున్నారు. ఇది భారత అన్క్యాప్డ్ ప్లేయర్స్ కార్తిక్ శర్మ, అకిబ్ దార్ విషయంలో నిజమైంది. ఇటీవల దేశీయ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వీరికి ఐపీఎల్ ఆడే అవకాశం రావడమే కాదు.. కోట్లలో డబ్బు కూడా రానుంది. అబుదాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ […]