Jubilee Hills By Poll : హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సోమవారం (అక్టోబర్ 13) విడుదల చేయనుంది. నామినేషన్ల సమర్పణ అక్టోబర్ 13 నుంచి 21 వరకు కొనసాగుతుంది, ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలను మినహా అన్ని రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో సమర్పించవచ్చు. ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా […]
Seediri Appalaraju : శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య రంగ పరిస్థితులపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన స్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని గురుకులల్లో విద్యార్థుల్లో హెపటైటిస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, కలుషిత ఆహారం, శుద్ధి చేయని నీరు కారణంగా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) డాక్టర్లు నిరసనార్థం ధర్నాలు చేస్తున్నారని, ప్రజలకు […]
Jogi Ramesh : విశాఖలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో జరుగుతున్న కుంభకోణాలు, డైవర్షన్ రాజకీయాలు, మరియు ఆయనపై ఎదురవుతున్న మద్యం కేసులపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కానీ నిజానికి మద్యం కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మా పార్టీనే. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా చీఫ్ పాలిటిక్స్ ను వేరే దిశలో మలిచే ప్రయత్నం […]
Telangana : తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘ అధ్యక్షుడిగా గటిక విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులు, ప్రతినిధులు ఏకగ్రీవ నిర్ణయంతో ఆయనను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెరిక కుల నాయకులు, సభ్యులు భారీగా హాజరయ్యారు. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గటిక విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. “పెరిక కుల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తాం. రాష్ట్రంలో ప్రతి జిల్లా స్థాయిలో కుల ఐక్యతను బలపరుస్తాం. […]
Womens World Cup 2025 : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన కెరీర్లో మరో గొప్ప మైలురాయిని అందుకుంది. ఉమెన్ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో మంధాన 5 వేల పరుగుల మైలురాయిని దాటింది. దీంతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు ఈ రికార్డును సాధించిన భారత మహిళా ఆటగాళ్లలో మిథాలి రాజ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు మంధాన ఆ జాబితాలో రెండో […]
పల్నాడులో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం.. పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో రోగి దామావత్ హర్యానాయక్ కు అధికారులు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే దావుపల్లి తండాకు వెళ్లిన పల్నాడు డీఎంహెచ్ఓ వెళ్లి, ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రేపు సీఆర్డీఏ […]
Minister Vivek : తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. మంత్రి వివేక్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సహ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై ఆయన చేసిన విమర్శలు సంచలనంగా నిలిచాయి. నిజామాబాద్‌లో మీడియాతో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. “నేను కష్టపడి పనిచేస్తున్నా, నాపై కుట్రలు జరుగుతున్నాయి. కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ కుట్రల వెనుక ఎవరో నాకు తెలుసు,” అని వ్యాఖ్యానించారు. “మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి నాపై విమర్శలు […]
ఖమ్మం జిల్లా నడిబొట్టున దాదాపు 200 కోట్ల పైచిలుకు వివాదంలో చిలికి చిలికి గాలి వానగా మారుతుంది .ఈ వివాదంలో పోలీసులు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వివాదం చల్లారటం లేదు.
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్‌లో ప్రచార సభలో మాట్లాడుతూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “పచ్చి జూటా మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో బుల్డోజర్లతో పాలన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి — కార్ కావాలా? లేక […]
అక్కడి హస్తం పార్టీలో ఐక్యత మేడిపండు చందమేనా? నాయకులు పైకి కౌగిలించుకుంటున్నట్టు కనిపిస్తున్నా… కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా? జిల్లాలో ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు. వాళ్ళలో ఇద్దరు ఒక వర్గం, ఒకాయన మరో వర్గంగా రాజకీయం చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడు తాజాగా ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకేనా? ఎవరా ముగ్గురు? ఏంటా మేడిపండు కథ? మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తాజాగా పార్టీ […]