Off The Record : వంగవీటి రంగా కుమార్తె అసలు వ్యూహమేంటి..?
- ఇక నుంచి ప్రజల్లోనే ఉంటానని రెండు నెలల క్రితం ప్రకటన
- రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని స్టేట్మెంట్
- పర్యటనల్లో అన్ని పార్టీలను టార్గెట్ చేస్తున్న ఆశాకిరణ్
- క్లారిటీ మిస్ అయిందా అన్న చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశాకిరణ్ అసలు వ్యూహం ఏంటి? ప్రజల్లో ఉంటానంటారు, రాజకీయాల్లోకి రానంటారు. తన తండ్రికి సరైన గుర్తింపు దక్కలేదంటూ ఇన్నేళ్ళ తర్వాత వాదన వినిపిస్తున్నారు. ఇంతకీ ఏం కోరుకుంటున్నారు ఆశాకిరణ్? తాను గందరగోళంలో ఉన్నారా? లేక వ్యూహాత్మకంగా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఆశాకిరణ్…దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె. ఆమె వ్యవహారశైలి ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఇక నుంచి ప్రజల్లోనే ఉంటానని రెండు నెలల క్రితం ప్రకటించారామె. రాధా రంగా మిత్ర మండలి సలహాలతో ముందుకు నడుస్తానని కూడా చెప్పారు. ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పడమైతే చెప్పారుగానీ…. తన పర్యటనల్లో అన్ని పార్టీలను టార్గెట్ చేస్తుండటంపై అనుమానాలు పెరుగుతున్నాయి. 2024 ఎన్నికల టైంలో… ఆమె వైసీపీలో చేరి విజయవాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా… ఆచరణలోకి రాలేదు. ఇక ఎన్నికలు ముగిసిన ఏడాదిన్నర తర్వాత సడన్‌గా బయటికి వచ్చి ఇక నుంచి ప్రజల్లో ఉంటానని ఆమె ఎందుకు ప్రకటించారు? ఒకవేళ రావాలనుకున్నా… క్లారిటీ మిస్ అయిందా అన్న చర్చలు మొదలయ్యాయి బెజవాడ రాజకీయవర్గాల్లో. వంగవీటి రంగా వారసుడిగా ఆశాకిరణ్ సోదరుడు రాధా 20 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారాయన. అయినా… ఆశాకిరణ్ మాత్రం ఇన్నాళ్ళుగా పెద్దగా ఇటువైపు ఇంట్రస్ట్ చూపలేదన్నది సన్నిహితుల మాట. ప్రజల్లో ఉంటానని ఇప్పుడామె ప్రకటనలు చేస్తున్నప్పటికీ ప్రధాన టార్గెట్ మాత్రం పొలిటికల్ ఎంట్రీనే అయి ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.
అదే సమయంలో తన పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడే లేదని ఆశాకిరణ్ చెప్పటం గందరగోళానికి దారి తీస్తోంది. అదే సమయంలో పలు వేదికలపై మాట్లాడుతూ… వంగవీటి రంగాకి ఏ రాజకీయ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదని అనడం ఆసక్తికరంగా మారుతోంది. ఆ విషయంలో టీడీపీ,జనసేన, వైసీపీ మూడు పార్టీలను కలిపే అంటున్నారు రంగా కుమార్తె. అలాగే… రంగా పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న పార్టీలు జిల్లాకు ఆయన పేరు పెట్టలేదని చేసిన వ్యాఖ్యల చుట్టూ రకరకాల ప్రశ్నలు పెరుగుతున్నాయి. వైసీపీ హయాంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి పేర్లు పెడుతున్న సమయంలో రంగా పేరు డిమాండ్ కొన్ని వర్గాల నుంచి వచ్చింది. అప్పుడు ఏ మాత్రం స్పందించని, మాట్లాడని ఆశాకిరణ్…ఇప్పుడెందుకు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారన్నది కొందరి క్వశ్చన్. ఇక విశాఖ రంగానాడు సభ లొకేషన్ మూడు సార్లు మార్చారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సభకు వచ్చే వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంటూ టీడీపీని టార్గెట్ చేశారామె.
Also Read
- OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
- OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?
- OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?
- Off The Record: అత్తారింటి నుంచి అసెంబ్లీకి..! కవిత పోటీపై బోధన్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
కానీ… తన సోదరుడు రాధా కూడా అదే పార్టీలో ఉన్నారనే సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. అసలు ఏక కాలంలో టీడీపీ, వైసీపీ, జనసేనల్ని విమర్శిస్తూ… ఆశా కిరణ్ ఏం ఆశిస్తున్నారో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాజకీయ వ్యవహారాల పరంగా ఆమె గందరగోళంలో ఉన్నారా? పొలిటికల్‌గా తన దారి ఎటో తేల్చుకోలేకపోతున్నారా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే నో అన్నదే సమాధానం. మరి ఇన్నేళ్ళ తర్వాత వంగవీటి రంగాకి గుర్తింపు ఇవ్వాలంటూ చేస్తున్న ప్రకటనల ద్వారా ఆశాకిరణ్ ఏం ఆశిస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఆమె కన్ప్యూజన్లో ఉన్నారా, లేక తాను క్లారిటీగానే ఉండి…. వ్యూహాత్మకంగా అవతలి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Summer Holidays : ఒకేసారి 5 భాషల్లో ఓటీటీలోకి ‘సమ్మర్ హాలీడేస్’! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
Meenakshi : విసిగిపోయి ఆ ఆఫర్లన్నీ రిజెక్ట్ చేశా
-
MS Narayana: ఘనంగా ఎంఎస్ నారాయణ మనవరాలు వివాహం.. టాలీవుడ్ ప్రముఖుల సందడి..!
-
O Torture Prema : హీరోగా మాదాల రంగారావు మనవడి ఎంట్రీ?
ట్రెండింగ్
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!