Blackberry Style Phone : మీరు పాత కాలపు బ్లాక్‌బెర్రీ ఫోన్లను, వాటిపై బటన్లతో టైపింగ్ చేయడాన్ని మిస్ అవుతున్నారా? అయితే మీ కోసమే “క్లిక్స్ కమ్యూనికేటర్” మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ల కోసం ఫిజికల్ కీబోర్డ్ కేసులను తయారు చేసి పాపులర్ అయిన క్లిక్స్ సంస్థ, ఇప్పుడు నేరుగా ఒక ఆండ్రాయిడ్ ఫోన్‌నే రూపొందించింది. ఇది ముఖ్యంగా “కమ్యూనికేషన్” కోసం తయారు చేయబడిన పరికరం.
ప్రత్యేకతలు, డిజైన్ : ఈ ఫోన్ చూడటానికి అచ్చం పాత బ్లాక్‌బెర్రీలా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో స్క్రీన్ కింద పూర్తి స్థాయిలో QWERTY ఫిజికల్ కీబోర్డ్ ఉంటుంది.
డిస్‌ప్లే: ఇది 4.03 అంగుళాల చిన్న OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. నేటి భారీ ఫోన్ల మధ్య ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది.
AI Effect : AI దెబ్బతో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌ల ధరలు.!
కీబోర్డ్: ఈ కీబోర్డ్ కేవలం టైపింగ్‌కే కాదు, టచ్-సెన్సిటివ్ ఫీచర్‌తో వస్తుంది. అంటే మీరు కీబోర్డ్ మీద వేలితో స్క్రోల్ చేస్తూ వెబ్ పేజీలు లేదా మెసేజ్‌లు చదువుకోవచ్చు.
ప్రాంప్ట్ కీ (Prompt Key): ఫోన్ సైడ్‌లో ఒక ప్రత్యేక బటన్ ఉంటుంది. దీన్ని నొక్కి పట్టుకుని వాయిస్ మెసేజ్‌లు పంపడం లేదా మీటింగ్‌లను ట్రాన్స్‌క్రిప్ట్ (మాటలను రాతగా మార్చడం) చేయవచ్చు. దీనికి రంగులు మారే సిగ్నల్ ఎల్‌ఈడీ కూడా ఉంది, ఇది నోటిఫికేషన్లను బట్టి మారుతుంటుంది.
సాఫ్ట్‌వేర్: ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) వెర్షన్‌తో పనిచేస్తుంది.
స్టోరేజ్: 256GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు.
కెమెరా: వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా , ముందు వైపు 24MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ: 4,000mAh బ్యాటరీతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ (Qi2) సదుపాయం కూడా ఉంది.
ఇతర ఫీచర్లు: 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5G సపోర్ట్, ఫిజికల్ సిమ్ , ఈ-సిమ్ (eSIM) సదుపాయాలు ఉన్నాయి.
ధర , లభ్యత : క్లిక్స్ కమ్యూనికేటర్ ప్రారంభ ధర $499 (సుమారు రూ. 41,500) గా నిర్ణయించారు. అయితే ఫిబ్రవరి 27 లోపు బుక్ చేసుకున్న వారికి $100 తగ్గింపుతో $399 (సుమారు రూ. 33,000) కే లభిస్తుంది. ఇది స్మోక్, క్లోవర్ , ఆనిక్స్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ఎవరి కోసం ఈ ఫోన్? : సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ (Doomscrolling) చేయకుండా, కేవలం మెసేజింగ్, ఈమెయిల్స్ , పనుల మీద దృష్టి పెట్టాలనుకునే వారికి ఇది ఒక “సెకండరీ ఫోన్”గా అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. “మెసేజింగ్ కోసం కిండిల్ (Kindle for messaging)” లాంటి పరికరం ఇది అని క్లిక్స్ సంస్థ అభివర్ణించింది.
US-Venezuela war: ‘‘మా అధ్యక్షుడు ప్రాణాలతో ఉన్నాడా?’’.. యూఎస్ దాడులపై వెనిజులా..