Maoists Free State : తెలంగాణ రాష్ట్రాన్ని అతి త్వరలోనే ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’గా ప్రకటించేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన కేవలం 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే మిగిలి ఉన్నారని, వారు కూడా లొంగిపోతే రాష్ట్రం పూర్తిస్థాయిలో మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం, అండర్ గ్రౌండ్‌లో ఉన్న ఈ 17 మంది నేతలపై ప్రభుత్వం భారీగా రివార్డులను ప్రకటించింది. వీరిపై మొత్తం కలిపి 2 కోట్ల 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఐదుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉండటం గమనార్హం.
Bandi Sanjay : తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం
పదవుల వారీగా విభజన:
సెంట్రల్ కమిటీ సభ్యులు:
స్టేట్ కమిటీ సభ్యులు:
డివిజన్ కమిటీ సభ్యులు:
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఈ 17 మంది మావోయిస్టు నేతలకు కీలక విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను వినియోగించుకుని లొంగిపోవాలని ఆయన సూచించారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ముగిసేలోపే తెలంగాణలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో బలగాలు మోహరించడం, నిఘా పెంచడం ద్వారా మావోయిస్టుల కదలికలను కట్టడి చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం, తెలంగాణలో ప్రస్తుతం చివరి అంకానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. మిగిలి ఉన్న ఈ 17 మంది అగ్రనేతలు గనుక పోలీసులకు లొంగిపోతే, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.