Konda Surekha : రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ లను కలిశారు. ఈ భేటీలో గత కొద్ది రోజులుగా తాను ఎదుర్కొంటున్న పరిణామాలను మంత్రి సురేఖ వివరించారు. సమావేశంలో ఆమె తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, పోలీసుల చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా, నిన్న రాత్రి తన […]
క్రమశిక్షణకు కేరాఫ్ అని ఢంకా బజాయించే బీజేపీలో ఆ పరిస్థితులు మారిపోతున్నాయా? కీచులాటలకు కేరాఫ్ అవుతోందా? ఎక్కడికక్కడ జిల్లాల్లో లొల్లి పెరిగిపోతోందా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ బీజేపీలో పరిస్థితులు మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు, బలం, జనంలోకి వెళ్లే సంగతులు ఎలాఉన్నా… క్రమశిక్షణ విషయంలో మాత్రం కట్టు తప్పలేదన్న అభిప్రాయం ఉండేది. కానీ… తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ పరిస్థితుల్ని మార్చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వికారాబాద్ […]
Crypto Scam : క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ పేర్లతో కోట్ల రూపాయల మోసం చేసిన మెటాఫండ్ కింగ్ పిన్ వరాల లోకేశ్వర్‌రావును కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ కు చెందిన తులసీ ప్రకాష్ తో స్నేహం ఏర్పడిన తర్వాత 2024లో ఈ మోసం ప్రారంభమైంది. మెటాఫండ్, యూబిట్ పేర్లతో నకిలీ యాప్‌లు సృష్టించి, పెట్టుబడిదారులను మోసం చేశారు. ఒక్కొక్క వ్యక్తికి 90,000 రూపాయలకు 1,000 […]
తెలంగాణలో మంత్రుల పేరు చెప్పి పేషీల సిబ్బంది సెటిల్ మెంట్స్ చేసేస్తున్నారా? పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం పసిగట్టిందా? అందుకే ఎక్స్ట్రా నిఘా పెట్టిందా? ఎక్కడెక్కడ అలాంటి నిఘా కొనసాగుతోంది? ఏ రూపంలో ఉంది? తెలంగాణ సచివాలయంలో ఇప్పుడో సరికొత్త వాతావరణం కనిపిస్తోందట. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం సాధారణమే అయినా… ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఇంటెలిజెన్స్ సిబ్బంది డేగకళ్ళతో దేని కోసమో వెదుకుతున్నట్టు అనిపిస్తోందంటున్నారు. మరీ ముఖ్యంగా మంత్రుల పేషీల విషయంలో […]
Tragedy : కరీంనగర్ జిల్లాలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న హత్యకేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. మొదట అనుమానాస్పద మరణం కేసుగా నమోదు చేసిన ఈ ఘటనను, పూర్తి దర్యాప్తు తర్వాత భార్య సహా ఆరుగురి కుట్ర ద్వారా జరిగిందని తేల్చారు. కరీంనగర్ లోని సప్తగిరి కాలనీకి చెందిన ప్రైవేట్ డ్రైవర్ కత్తి సురేష్, 2015లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మౌనిక డబ్బుల కోసం పడుపు వృత్తిని […]
తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్స్‌ని చూడబోతున్నామా? ఇప్పుడిప్పుడే ఒక డిఫరెంట్, ఇప్పటి వరకు అసలు ఊహకు కూడా అందని వాతావరణం నెలకొంటోందా? ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నాయకులు ప్రస్తుతం బీజేపీ రాడార్ పరిధిలో ఉన్నారా?
VC Sajjanar : రోజురోజుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజల్లో పాపులారిటీ సాధించేందుకు వేదికగా మారాయి. అయితే, కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు ఈ అవకాశాన్ని అశ్లీల కంటెంట్ ప్రసారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్స్టాగ్రాం రీల్స్‌లో క్రమంగా వీడియోలను తొలగించాయి. Mujra Party : అమ్మాయిలతో విందులో చిందులు.. చిక్కిన నేతలు వీసీ సజ్జనార్ ఇటీవల సోషల్ […]
Adluri Laxman : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “మా ప్రభుత్వం రెండేళ్లు కూడా పూర్తవ్వకముందే బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. “బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా తమ వాగ్దానాలను అమలు చేయలేదు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు మా ప్రభుత్వంపై బోగస్ ఆరోపణలు చేయడం […]
రాజకీయ నాయకుల ప్రమేయంతో నగర శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ముజ్రా పార్టీ సంచలనానికి కారణమైంది. రాచకొండ పోలీసుల సకాలంలో జోక్యంతో ఈ పార్టీని భగ్నం చేశారు.
నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం, 2025 అక్టోబర్ 18 వరకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే పరీక్ష ఫీజును కూడా చెల్లించవచ్చు. ఈ స్కాలర్షిప్ కోసం 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక […]