డ్రంకెన్ డ్రైవ్ లో వాహనాలను సీజ్ చేయవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పోలీసులకు ఆదేశించారు. ఈ మేరకు కమిషనరేట్ మినీ కాన్ఫరెన్స్హాల్లో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ట్రాఫిక్ ఉన్నతాధికారులు, సిబ్బందితో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ అవగాహన సమావేశాలు పెంచాలన్నారు. పాదచారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు […]
తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు ప్రాంతాల్లో వర్షం తాకిడి అధికంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నవంబర్ 10 వరకు ఇలాగే వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఫ్లడ్ అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో సీఎం ఎంకే […]
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జైలు రణరంగంగా మారింది. తోటి ఖైదీ మరణించిన వార్త విన్న ఖైదీలు ఆవేశంతో జైలు సిబ్బందిపై దాడికి దిగి జైలుకు నిప్పుపెట్టారు. అంతేకాకుండా జైలర్‌ను నిర్బంధించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. సందీప్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్నాడు. ఈ మధ్య సందీప్ డెంగీ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో సైఫాయి ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఈనేపథ్యంలో సైఫాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మరణించారు. ఈ […]
బంగారం అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఓ ప్రయాణికుడు సినిఫక్కిలో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసి కస్టమ్ అధికారులకు దొరికిపోయాడు. అబుదాబి నుంచి చైన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని కరిగించి సన్నటి వైర్లుగా తయారు చేసి లగేజ్ ట్రాలీ బ్యాగ్ సైడ్ లో వున్న రాడ్స్ లో అమర్చాడు. ఆ బంగారాన్ని దర్జాగా తరలించేందుకు ప్రయత్నించగా చైన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్ అధికారులు చేసిన తనిఖీల్లో రెండు కిలోల బంగారం బయట పడింది. దీంతో […]
తెలంగాణలోని వరి రైతులు షాక్ ఇస్తూ తెలంగాణ సర్కార్ ఓ ప్రకటన చేసింది. వేసవిలో వరి వేయద్దని మరోసారి తేల్చిచెప్పింది. దీనిపై మీడియాతో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వానకాలం పంటను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేస్తే మాత్రం కొనే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు. విత్తనం కోసం మాత్రం వరి వేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి […]
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి శనివారం జూబ్లీహిల్స్‌లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఫిల్మింనగర్‌లో ఏర్పాటు చేసిన దక్కన్ కిచెన్ ఫైన్ రెస్టారెంట్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రజలెవరూ గత సంవత్సరకాలంగా బయటకు రావడంలేదని.. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలు మెచ్చే అభిరుచులతో దక్కన్ కిచెన్ ఫైన్ […]
ఆఫ్రికా దేశంలోని సియర్రా లియోన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 91 మంది మృతి చెందగా 100 మంది గాయాలయ్యాయి. సియర్రా లియోన్‌లోని ఫ్రీటౌన్‌లో ఓ లారీని చమురు ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనాలను అక్కడే ఉంచారు. చమురు ట్యాంకర్ నుంచి చమురు లీక్ అవుతుండడంతో చమురు కోసం స్థానిక జనాలు ఎగబడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చమురు ట్యాంకర్లో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. దీంతో 91 మంది మంటల్లో చిక్కుకొని […]
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలు మరొ కొన్ని రాష్ట్రాలు కూడా వారివారి రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాయి. అయితే ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రతి పక్షాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఓ ప్రకటన […]
తెలంగాణలోని మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మద్యం దుకాణాలకు టెండర్లు వేయదలచిన వారు ఈ నెల 10 నుంచి 18 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. నాన్ రిఫండబుల్ అమౌంట్ రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన మద్యం షాపుల లాటరీ తీయనున్నట్లు ప్రకటించింది. అయితే గత 2019 నిర్వహించిన లాటరీలో మద్యం షాపులు వచ్చినవారి గడువు అక్టోబర్‌తో ముగిసింది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు […]
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ పంట కొనుగోళ్లలో, రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్ధతు ధర లభించడం లేదని, ప్రభుత్వ తీరు మారకుంటే కాంగ్రెస్ రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ […]