కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ఎంతో మంది జీవితాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. మొన్నటి వరకు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడం, ఒమిక్రాన్ ఇండియాలో వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో సైతం కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి.
అయితే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న 11 మంది హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ థర్డ్ వేవ్‌లో భాగంగా గత రెండు రోజులుగా హౌస్ సర్జన్‌లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారు కరోనా పరీక్షలు చేయించుకోగా 11 మంది హౌస్ సర్జన్‌లకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఉస్మానియా ఆసుపత్రిలో కలకలం రేగుతోంది.