తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మద్యం సేవించి పట్టుబడిన వారి వెంట మద్యం సేవించనివారేవరైనా ఉంటే వారికి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. మద్యం తాగిన వారి వెంట ఎవరూ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులను పిలిచి వాహనం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎవరూ రాకపోతే వాహనం పీఎస్కు తరలించి […]
తెలంగాణలో మరో నిరుద్యోగి నేలకొరిగాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్థాపానికి గురై ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాల్గూడకు చెందిన మహ్మద్ అజాజ్ అనే యువకుడు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఉద్యోగం లేకుండా కుటుంబ పోషణ భారమవడంతో డిప్రెషన్లోకి వెళ్లిన అజాజ్ యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అజాజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వైద్యం వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓజోన్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రాందిగల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజనమ్మ (35), ఈదుల కృష్ణయ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. భర్త కృష్ణయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా, అంజనమ్మ వ్యవసాయ కూలీలకు వెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. కాగా అంజనమ్మకు 3 నెలల క్రితం వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా కాలికి […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి సృష్టించిన అల్లకల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా తెలంగాణలో 33,226 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 151 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. గడిచిని 24 గంటల్లో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా.. 190 మంది కరోనా నుంచి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,838 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 6,72,203 మంది […]
కార్తీక మాసం లయకారుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెలలో పెద్ద ఎత్తున్న భక్తులు శివాలయాలను దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటికిటలాడింది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు కొనసాగనున్నాయి. స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన […]
దేశంలో డిజిటల్ విప్లవం ఎంతవరకు సాధ్యమైంది ఈ వీడియో ను చూసి మనం తెలుసోవచ్చు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ప్రధాని మోడీ డిజిటల్ విప్లవానికి తెర లేపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఏ చిన్న కిరాణా కొట్టు, పాన్, టీ స్టాల్ ఇలా చిన్న చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు ఇంటిముందుకు గంగిరెద్దులను తీసుకువచ్చి ఆటలాడిస్తుంటారు. అలా వచ్చిన వారికి బియ్యంతో […]
జై భీమ్ చిత్రంలోని ఓ సన్నివేశంలో లాయర్ చంద్రు (సూర్య) కాలు మీద కాలు వేసుకుని ఠీవిగా న్యూస్ పేపర్ చదువుతుండగా.. అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చున్న గిరిజన చిన్నారి అతనిని అనుసరిస్తూ.. పేపరు చేతిలోకి తీసుకుంటూ… భయం భయంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో చంద్రు ఆ పాపకేసి ఎవరికీ భయపడకు (నువ్వు భయపడకు.. నువ్వు అనుకున్నదే చేయి.. ఈ సమాజంలో నీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకో.. ఆడపిల్ల అంటే ఆబల కాదు సబల అని […]
ఏపీలో ఎక్కడ వాహనాలు తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి దొరుకుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. అనుమాన వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా సుమారు 6 కోట్లు విలువ చేసే నిషేదిత గంజాయిని పట్టుకున్నట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. Read Also : వీడియో : స్కూటీపై టపాసులు తీసుకెళ్లుండగా పేలుడు.. తండ్రికొడుకులు దుర్మరణం.. ఈ నేపథ్యంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు […]
కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించిన ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ను కోరారు. శుక్రవారం టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబులతో కూడిన టీడీపీ బృందం ఎస్ఈసీని కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల పర్వంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. […]
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిన విషయం విధితమే. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెడుతామని ప్రకటన కూడా చేశారు. అనంతరం జరిగిన హుజురబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. […]