ఏపీలో రేపట్నుంచి 60 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10-13 వరకు హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోసులు, 12, 13వ తేదీల నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసులు ఇవ్వనున్న ప్రభుత్వం పేర్కొంది.
మున్సిపాల్టీలు, పీఆర్ అండ్ ఆర్డీ, పోలీస్ శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగులకు సైతం బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ కార్యాలయాల్లో బూస్టర్ డోసులు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.