దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వ్యాప్త నేపథ్యంలో భారీగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబందనలు కఠినతరం చేయడంతో పాటు, నైట్ కర్ఫ్యూను విధిస్తున్నారు.
అయితే తెలంగాణలో సైతం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే తాజాగా వచ్చిన కరోనా కేసలు సంఖ్య నిన్నటితో పోల్చితే తక్కువగా రావడం గమనార్హం. తాజాగా తెలంగా వ్యాప్తంగా 1,673 కరోనా కేసులు రాగా, ఒకరు కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 330 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 13,522 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.