తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని కోరేందుకు కేటీఆర్‌తో కలిసి ఢిల్లీలో పీయూష్ గోయల్ కలిశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పంటల కొనుగోలు బాధ్యత కేంద్రానిది, రాజ్యాంగం ప్రకారం అది కేంద్రం బాధ్యత అని విజ్ఞప్తి చేశామన్నారు. దానికి పీయూష్ గోయల్ వెకిలినవ్వు నవ్వారు .. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయి .. కొననే కొనం అని అన్నారని వెల్లడించారు. మాది కొత్త రాష్ట్రం.. ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం అని కోరినా పట్టించుకోలేదు .. క్రాప్ చేసుకోండి అని […]
కూంబింగ్ నిర్వహించే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబి ట్రాప్‌లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట అటవీ ప్రాంతంలో బూబి ట్రాప్ లు మావోయిస్టులు అమర్చారు. కూబింగ్ చేసే పోలీస్ బలగాలు లక్ష్యంగా ఏడు చోట్ల పదునైన వెదురు కర్రలతో బూబి ట్రాప్లను మావోలు ఏర్పాటు చేశారు. కానీ… చింతూరు డివిజన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా బూబి ట్రాప్ లను గుర్తించి ధ్వంసం చేశారు. కాలిబాటల్లో గోతులు తవ్వి పదునైన వెదురు కర్రలతో […]
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ షెడ్యూల్‌కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. లోకల్ 12 సీట్లకు షెడ్యూల్ ప్రకటన చేయగా.. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సీటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగనుంది. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23 నామినేషన్ల […]
ఏపీ పీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా సభ్యత్వ నమోదు చేయడం ద్వారా ఏడాదిలో పార్టీ సంస్థాగతంగా బలపడతుందని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త గురుతర బాధ్యతతో ఇంటి వద్దనే సభ్యత్వ నమోదు జరిగేలా జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ చూపాలన్నారు. కమిటీల ఏర్పాటుతో పాటు మండల స్థాయి నుంచి నమోదుకు పార్టీలో గుర్తింపు ఇవ్వాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముకొనేవాడు […]
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు రాష్ట్రం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అంతేకాకుండా ఆహార పంపిణీతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్ ఆహార పంపిణీని పరిశీలించారు. వర్షాలు తగ్గేవరకు అమ్మక్యాంటీన్ల ద్వారా ఉచిత ఆహారం అందిస్తామని వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి 11 న ఉత్తర తమిళనాడు తీరానికి చేయకునే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40,60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. 7 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే […]
కామారెడ్డి టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఆరోపించారు. అంతేకాకుండా పెన్షన్లను పది రెట్లు పెంచామని, 42 లక్షల మందికి 10వేల కోట్ల పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వైద్య వ్యవస్థపై విశ్వాసం పెంచామని, జనం సర్కార్ దవాఖానకు పోయేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేరని, టీఆర్ఎస్ అభివృద్ధిని బీజేపీ పాదయాత్రలోనే బయటపెట్టారన్నారు. ఉత్తర భారతదేశానికి ఓ […]
ఫేస్బుక్ వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుకుంటోంది. ఫేస్ బుక్ వినియోగాదారుల డాటా లీక్ అయ్యిందని లాంటి ఆరోపణలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది ఫేస్బుక్. అయితే వివాదంలో చిక్కకున్న ప్రతి సారి ఆధికంగా నష్టం వాటిల్లడంతో ఫేస్బుక్ మాతృసంస్థ పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు.. మెటా గా కూడా నామకరణం చేశారు. కానీ ఇప్పుడు ఆ పేరు చిక్కులు తెచ్చిపోట్టింది. అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ కోర్టును ఆశ్రయించారు. […]
మంత్రి తలసాని కుమారుడిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఖైరతాబాద్‌లో జరుగుతున్న సదర్ ఉత్సవాలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారు తలసాని సాయికిర్‌ణ్ తన కారులో వచ్చారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ వస్తుండగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఇందిరానగర్‌కు చెందిన సంతోష్ (32) అనే వ్యక్తి పాదం పై నుంచి ఆయన కారు పోవడంతో ఆ వ్యక్తి గాయాలయ్యాయి. దీంతో సదరు బాధితుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తలసాని సాయికిరణ్‌పై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు […]
సీఎం కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతూ రైతులకు భ్రమ కలిపిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలు మార్చాలని సూచిస్తుంటే.. ఇక్కడ రాష్రంలో బండి సంజయ్ రైతులను వరి పంట వేయమని చెప్పడం కరెక్టు కాదన్నారు. ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే.. సిల్లీ బీజేపీ వేయమంటోంది అంటూ ఎద్దేవా చేశారు. బండి ఇక్కనైన తన తీరు మార్చుకోవాలని.. లేదంటే […]