ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతాలోపాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. భద్రతాలోపాలపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 5న భద్రతా లోపాల వల్ల ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన రద్దుయింది.
నేడు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ భేటీ కానున్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చర్చించేందుకు ఆర్జీవీ మంత్రి పేర్ని నాని అపాయిట్‌మెంట్ కోరగా ఆయన ఈ రోజు చర్చకు ఆహ్వనించారు.
నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధులు బహిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రొబేషన్ ప్రకటించాలంటూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆందోళన బాట పట్టారు.
నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. అయితే ఈ ఆక్సిజన్ ప్లాంట్లను సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు రూ. 426కోట్ల వ్యయంతో 133 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.
నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్థిల్లాలంటూ బీజేపీ కార్యకర్తలు, నేతలు మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠంలో నిర్వహించనున్న మృత్యుంజయ హోమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాల్గొననున్నారు.
నేడు డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై ఈ భేటీ చర్చించనున్నారు.
నేడు రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా, ఒమిక్రాన్ విజృంభన నేపథ్యంలో చర్చించనున్నారు.
నేటి నుంచి ఏపీలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లు పంపిణీ చేయనున్నారు. అయితే ఈ బూస్టర్ డోసుల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి విశాఖలో చేపల వేటకు అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకార గ్రామాల్లో ఆంక్షుల ఎత్తివేశారు.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,610లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,660లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 64,600లుగా ఉంది.