పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర వ్యాట్ తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఈ నెల 9 […]
మహరాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీయూలో కరోనా వార్డులో 17 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురు మృతి చెందగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అందుపులోకి తీసుకువచ్చాయి. షాట్ సర్య్కూట్ కారణంగా ఈ […]
తెలంగాణ బీజేపీ నాయకులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. టీబీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పించండి అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు రైతులను ఆందోళనకు గురి చేయడం అలవాటే అంటూ ఎర్రబెల్లి విమర్శలు చేశారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు […]
ఏపీలో గంజాయి పట్టివేత నిత్యకృత్యంగా మారింది. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడోచోట భారీగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజా మంగళగిరిలో మరోసారి గంజాయి రవాణా తతంగం బయట పడింది. మంగళగిరిలోని కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనఖీ చేస్తుండగా ఓ కారులో 50 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. విశాఖ నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్నారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. అయితే ఈ […]
మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సాధించింది. తెలుగు చిత్రాల్లో కూడా గెస్ట్ రోల్, ఐటెం సాంగ్‌లకు పరిమితమైన సన్నీ.. మరింత డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితామ్ బచ్చన్ లు అడుగుపెట్టిన నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) రంగంలోకి సన్నీ కూడా ప్రవేశించింది. ఇవి ఫోటోలు, డిజిటల్ ఆస్తలు, ఆడియోలు, వీడియోలు సహా ఇతర ఫార్మాట్లలోని డిజిటల్ […]
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్డీయే పాలిత ప్రాంతాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా తమ ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్ర వ్యాట్‌ను కూడా తగ్గించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలపై ఆధ్యాయనం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింస్తే రాష్ట్ర ఆదాయాంపై పడే భారంపై అధికారులతో చర్చిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించే పరిస్థితి లేదని అధికారులు ప్రభుత్వానికి వెల్లడించినట్లు […]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు పంపిణీకి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే విషయాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. ప్రణాళిక శాఖ దీనికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాల్ని ఇంటింటికి పంపిణీ చేయడానికి కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ పథకాలు స్టేటస్ రిపోర్టులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు […]
హీరీ నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేయగా గుత్తా సుమన్ అనే వ్యక్తి ఫాం హౌస్‌లు లీజుకు తీసుకొని క్యాసినో నిర్వహిస్తున్నట్లు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా బేగంపేటలో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు మరికొందరు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ప్రతి పండుగ లకు ముఖ్యమైన రోజుల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు, […]
నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీని మంచికి ఎంతో మంది ఉపయోగిస్తుంటే.. కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే మీ డబ్బులు ఎక్కువ అవుతాయంటూ నమ్మబలికి సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నారపల్లికి చెందిన ఓ వ్యక్తికి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే చాలా డబ్బులు వస్తాయని చెప్పి రూ.85 లక్షల వరకు స్వాహా చేశారు. తీరా […]
ఏపీ వ్యాప్తంగా రేపు బీజేపీ నిరసన చేపట్టేందుకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయానికి మద్దతుగా బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు మరొ కొన్ని రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర సుంకాన్ని తగ్గించాయి. ఈ నేపథ్యంలో ఏపీలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. […]