కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మరోసారి విజృంభిస్తోంది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో సైతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా, ఒమిక్రాన్ కట్టడికి బూస్టర్ డోస్‌ను వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించడంతో దేశంలోని పలు రాష్ట్రాలో బూస్టర్ డోస్‌లు పంపిణీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణలో 60 ఏళ్ళు పైబడిన వాళ్లకు, హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రoట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. మొదటి, రెండో డోస్ తీసుకున్న వాక్సిన్ నే మూడో డోస్ గా తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. రెండో డోస్ పూర్తయిన 9 నెలలకు బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్‌ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు.